హోమ్ /వార్తలు /National రాజకీయం /

Konijeti Rosaiah: ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. అసెంబ్లీలో మంత్రిగా తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్న హరీష్ రావు

Konijeti Rosaiah: ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. అసెంబ్లీలో మంత్రిగా తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్న హరీష్ రావు

ఈ స్థాయిలో ఉండడానికి రోశయ్యే కారణం

ఈ స్థాయిలో ఉండడానికి రోశయ్యే కారణం

harish rao comments on konijeti roshaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటే అని చెప్పాలి. పార్టీలకు అతీతంగా అందరు రాజకీయ నేతలు ప్రశంసలు కురిపిస్తూ.. నాటి గుర్తులను నెమరవేసుకుంటున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆయనకు సంబంధించి ఆసక్తిర అంశాన్ని బయట పెట్టారు.

ఇంకా చదవండి ...

harish rao comments on konijeti roshaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ సీఎం కొణిజేటి రోశయ్య(Konijeti Roshaiah) మరణంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ మేథవి.. ఆర్థిక సంస్కర్త.. అయిన రోశయ్య మరణం దురదృష్టకరం అని ఆయన అన్నారు. రోషయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందని వివరించారు. తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని గుర్తు చేసేవారు. అసెంబ్లీలో తాను తొలిసారిగా మంత్రిగా మాట్లాడినప్పుడు రోశయ్య పిలిచి అభినందించారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ కేబినెట్ సమయంలో హరీష్ రావుకు మంత్రి పదవి లభించింది. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా.. మంత్రి అయిన తరువాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే మంత్రిగా ఆయన తొలి రోజే.. ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఆ సమయంలో మంత్రిగా తాను సమాధానం చెప్పాల్సి వచ్చిందని.. అయితే తాను సమాధానం చెప్పిన తరువాత.. అక్కడే ఉన్న రోషయ్య చాలా అభినందించారని.. తనకు మంచి భవిష్యత్ ఉందని రోషయ్యే గుర్తు చేశారన్నారు. తొలిసారి మంత్రి పదవి చేపట్టిన తొలి రోజే.. మంత్రిగా చక్కటి సమాధానం చెప్పానని వెన్ను తట్టి ప్రోత్సహించినట్టు చెప్పారు. కొణిజేటి రోశయ్య భౌతక దేహానికి పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు.

రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నరోశయ్య మరణం దురదృష్టకరమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, కేవలం ఆ ఘనత ఆయన ఒక్కరిదేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంటేరియన్‌గా, వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు అన్నారు. అక్కడితోనే ఆయన ప్రస్తానం ఆగిపోలేదని ముఖ్యమంత్రిగా.. గవర్నర్ గా ఇలా అన్ని కీలక పదవులకు న్యాయం చేసిన ఘనత ఆయనది అని హరీష్ గుర్తు చేశారు.

ఇదీ చదవండి: అధికార పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సీఎం క్లాస్ పీకినా తగ్గేతే లే అంటున్న వైసీపీ నేతలు

ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా సేవలు అందించారని తెలిపారు. అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వహించి ఆయన సేవలందించిన పదవులకే వన్నె తెచ్చారని తెలిపారు. ఆయన అపార రాజకీయ ప్రజ్ఞాశాలి అని వివరించారు. తన పార్టీ, ఇతర పార్టీల వారు అనే తారతమ్యం చూపకుండా అందరితోనూ కలిసిపోయేవారని చెప్పారు. అందుకే స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా మిత్రులను సంపాదించుకున్న అరుదైన రాజకీయ వేత్త రోశయ్య అని వివరించారు.

ఇదీ చదవండి: : అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత.. ఆర్థిక నిపుణుడిని కోల్పోయిన రాష్ట్రం.. ప్రముఖల ప్రశంసలు

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై ఆయనతో చాలా సార్లు చర్చించామని తెలిపారు. ఏది ఏమైనా తెలుగు ప్రజలు ఒక అపార రాజకీయ అనుభవ శాలిని కోల్పోయారని అన్నారు. కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి: ఏజెన్సీలో చేతబడి కలకలం.. అనుమానంతో దాడి.. ముగ్గురు మృతి

రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లో మహాప్రస్తానంలో జరగనున్నట్టుగా కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం స్టార్ ఆస్పత్రి నుంచి ఇంటి అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించనున్నట్టుగా చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఇంట్లో తుది పూజలు చేసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు తరలించనున్నట్టుగా చెప్పారు.

ఇదీ చదవండి: ఈ ఇడ్లీ టేస్ట్ ఒక్కసారి చూస్తే చాలు.. మళ్లీ మళ్లీ తింటారు.. టేస్టే కాదు హెల్తీ కూడా

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నట్టుగా చెప్పారు. అనంతరం గాంధీ భవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే కొంపల్లిలోని రోశయ్య ఫాం హౌస్ లో అధికారిక లాంచనాల మధ్య రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Rosaiah, Telangana

ఉత్తమ కథలు