యురేనియం తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

యురేనియం నుంచి వచ్చే అణు ధార్మికత వల్లే పీల్చేగాలి, తాగే నీరు, పంటలు పండే నేల కలుషితమై మనిషి జీవితం నరకప్రాయంగా తయారవుతుందన్నారు కేటీఆర్.

news18-telugu
Updated: September 16, 2019, 12:33 PM IST
యురేనియం తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
మంత్రి కేటీఆర్
news18-telugu
Updated: September 16, 2019, 12:33 PM IST
యురేనియం తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం  పెట్టింది ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ మంత్రి కేటీఆర్ సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రజల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిస్తోందన్నారు. యురేనియం తవ్వకాలు జరపడం వల్లే మానవాళితో పాటు సమస్త ప్రాణకోటికి ముప్పుగా పరిగణించే అవకాశాలున్నాయన్నారు. తవ్వకాల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలనే కేంద్రాన్ని కోరారు.

యురేనియం నుంచి వచ్చే అణు ధార్మికత వల్లే పీల్చేగాలి, తాగే నీరు, పంటలు పండే నేల కలుషితమై మనిషి జీవితం నరకప్రాయంగా తయారవుతుందన్నారు కేటీఆర్. అభివృద్ధి చెందిన దేశాల్లో చేపట్టిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా యురేనియ తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం కూడా ఏకీభవిస్తుందని తెలిపారు. ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులందర్నీ గౌరవిస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.

 

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...