TELANGANA MINISTERS KOPPULA ESHWAR AND GANGULA KAMALAKAR FEELS HUZURABAD TENSION AK
Huzurabad: ఆ ఇద్దరు మంత్రులకు ‘హుజూరాబాద్’ టెన్షన్.. తేడా వస్తే అలా జరుగుతుందా ?
ప్రతీకాత్మక చిత్రం
Huzurabad: సాధారణంగా ఇతర టీఆర్ఎస్ నేతలు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో సక్సెస్ కాకపోతే అధినేత కేసీఆర్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మంత్రులు తమ బాధ్యతలను నిర్వహించే విషయంలో సక్సెస్ కాకపోతే వారి పదవులకే గండం ఏర్పడే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణ రాజకీయమంతా మళ్లీ అటు వైపు మళ్లింది. గెలుపు కోసం బీజేపీ తరపున బరిలో ఉన్న మాజీమంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించేందుకు మంత్రి హరీశ్ రావు బాధ్యతలు తీసుకోగా.. మరికొందరు టీఆర్ఎస్ మంత్రులు, ముఖ్యనేతలు హుజూరాబాద్‌లో ఉంటూ ఆయన గెలుపు కోసం పని చేస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్కు ప్రత్యర్థి మాజీమంత్రి ఈటల రాజేందర్ కావడంతో.. ఆయనపై గులాబీ దళం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏ మాత్రం తేడా వచ్చిన గతేడాది ఇదే సమయంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదనే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది.
అందుకే హుజూరాబాద్‌లో గెలుపు కోసం ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని టీఆర్ఎస్ గట్టిగా డిసైడయ్యింది. ఈ క్రమంలో పలువురు ముఖ్యనేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లకు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు మంత్రులకు హుజూరాబాద్ టెన్షన్ పట్టుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఇతర టీఆర్ఎస్ నేతలు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో సక్సెస్ కాకపోతే అధినేత కేసీఆర్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మంత్రులు తమ బాధ్యతలను నిర్వహించే విషయంలో సక్సెస్ కాకపోతే వారి పదవులకే గండం ఏర్పడే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సమాచారం.
ఒకవేళ మంత్రులు హుజూరాబాద్‌లో పార్టీకి మెరుగైన ఫలితాలు తీసుకురావడంలో విఫలమైతే.. అది వారి పదవిపైనే ప్రభావం చూపుతుందని పార్టీలో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం పలువురు మంత్రులకు ఎంతో కీలకం కానుందని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.