TSRTC Strike | గొంతెమ్మ కోరికలు సరికాదు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రుల వార్నింగ్

TSRTC Strike | ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు సరికాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: October 12, 2019, 10:58 PM IST
TSRTC Strike | గొంతెమ్మ కోరికలు సరికాదు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రుల వార్నింగ్
వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్యే. 2001 నుంచి టీఆర్ఎస్‌లో ఉన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.
news18-telugu
Updated: October 12, 2019, 10:58 PM IST
ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు సరికాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల అనైతిక డిమాండ్లు తీర్చడం కంటే.. నాలుగు కోట్ల మంది ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని ప్రశ్నించారు.

మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. కొందరు యూనియన్ లీడర్ల అత్యుత్సాహం వల్లే ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. రైల్వేను ప్రైవేటీకరిస్తున్న బీజేపీ ఆర్టీసీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గొంతు చించుకుంటున్న విపక్ష నేతలు.. వాళ్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని తలసాని హెచ్చరించారు. తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పామా అని మరోసారి ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కొన్ని..

1. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి


2. ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపు
3. పట్టణాల్లో నష్టాలు ప్రభుత్వం భరించాలి
4. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
Loading...
5. ఆర్టీసీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
6. మోటార్ వెహికల్ ట్యాక్స్ రద్దు చేయాలి
7. తార్నాక ఆస్పత్రిలో వైద్య సదుపాయం కల్పించాలి

తెలంగాణలో ఆర్టీసిని విలీనం చేయాలంటూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం అది కుదిరేపని కాదని స్పష్టం చేసింది. దీంతోపాటు సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది. ఈ క్రమంలో కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను సాధించే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో వారం రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ
13 వంటా వార్పు
14న డిపోల ఎదుట బైఠాయింపు, ఆర్టీసీ కార్మికుల సభ
15న రాస్తారోకోలు
16న విద్యార్థులతో కలసి ర్యాలీలు
17న రాష్ట్రవ్యాప్తంగా ధూంధాం
18న బైక్ ర్యాలీలు
19న తెలంగాణ బంద్
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...