• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA MINISTER SATYAVATHI RATHODE CONVOY STOPPED BY RTC EMPLOYEES MS

తెలంగాణ మంత్రికి ఆర్టీసీ సెగ... కాన్వాయ్‌కి అడ్డుపడ్డ కార్మికులు..

తెలంగాణ మంత్రికి ఆర్టీసీ సెగ... కాన్వాయ్‌కి అడ్డుపడ్డ కార్మికులు..

ప్రతీకాత్మక చిత్రం

భద్రాచలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన మంత్రిని.. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఆర్టీసీ కార్మికులు,వామపక్ష నాయకులు అడ్డుకున్నారు.

  • Share this:
    తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. భద్రాచలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన మంత్రిని.. భద్రాచలం
    బ్రిడ్జి సెంటర్ వద్ద ఆర్టీసీ కార్మికులు,వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కి అడ్డుపడి మంత్రిని అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించారు.
    ప్రభుత్వానికి,మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాన్వాయ్‌కి అడ్డుగా బైఠాయించిన నేతలను బలవంతంగా పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు అక్కడనుంచి కదలకపోవడంతో మరో మార్గంలో మంత్రి కాన్వాయ్‌ని అక్కడినుంచి పంపించారు. దీంతో పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.

    కాగా,గురువారంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. సమస్య పరిష్కారానికి హైకోర్టు ప్రతిపాదించిన సుప్రీం మాజీ న్యాయమూర్తుల కమిటీని ప్రభుత్వం నిరాకరించింది. దీంతో సమస్య ఎలా పరిష్కారమవుతుందన్నది అంతుచిక్కడం లేదు. మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు చెప్పనుంది.

    First published: