Home /News /politics /

TELANGANA MINISTER KT RAMARAO TOOK CLASS FOR TRS LEADERS SAYS TO FOLLOW MLA JEEVAN REDDY AK

KT RamaRao: ఆ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)

KT RamaRao: తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు చెప్పేందుకు కేటీఆర్‌ను కలిశారట ఆ నేతలు. అయితే వారి సమస్యలు విన్న కేటీఆర్.. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై మీరంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారికి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటల దాడిని టీఆర్ఎస్ కూడా గట్టిగానే ఎదుర్కొంటోంది. వారికి కౌంటర్ ఇస్తోంది. అయితే ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కొంత నేతలపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం కొందరు నేతలు మాత్రమే విపక్షాల విమర్శలపై స్పందించి.. వారికి కౌంటర్ ఇస్తున్నారు. మిగతా నేతలు ఈ విషయంలో అంత యాక్టివ్‌గా లేరనే భావన టీఆర్ఎస్ నాయకత్వంలో ఉంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తనను కలిసిన టీఆర్ఎస్ నేతలకు చెప్పారని.. వారికి క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కేటీఆర్‌ను కలిశారట.

    తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు చెప్పేందుకు కేటీఆర్‌ను కలిశారట ఆ నేతలు. అయితే వారి సమస్యలు విన్న కేటీఆర్.. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై మీరంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారికి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్‌పై మాటల దాడిని తీవ్రతరం చేస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు కేసీఆర్, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

    అయితే వారి విమర్శలకు అధికార టీఆర్ఎస్ నుంచి కొద్దిమంది నుంచి మాత్రమే సమాధానాలు, కౌంటర్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని తనను కలిసిన నేతల వద్ద ప్రస్తావించిన కేటీఆర్.. వాటి విషయంలో స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా ? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరును ప్రముఖంగా ప్రస్తావించారని సమాచారం.

    ఆ తేదీల్లో ఈటలపై దాడి.. ఆ తరువాత రంగంలోకి జమున.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

    Huzurabad: ఆ ఇద్దరు మంత్రులకు ‘హుజూరాబాద్’ టెన్షన్.. తేడా వస్తే అలా జరుగుతుందా ?

    పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినప్పటికీ.. జీవన్ రెడ్డి విపక్షాల చేసే విమర్శలను సీరియస్‌గా తీసుకుని వారికి కౌంటర్ ఇస్తున్నారని కేటీఆర్ తనను కలిసి నేతలకు తెలిపారట. అలా మీరేందుకు విపక్షాల చేస్తున్న విపక్షాలను సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రశ్నించారట. విపక్షాలను ఎదుర్కోవడంలో వెనకబడితే.. ఆ తరువాత ఆత్మరక్షణలో పడిపోతారని వారిని హెచ్చరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుల్లో ఒకరైన జీవన్ రెడ్డి.. ఆయన మెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: KTR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు