• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA MINISTER JAGADISH REDDY RESPONDS ON INTER RESULT SB

ఇంటర్ ఫలితాలపై రాజకీయాలొద్దు.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు : మంత్రి జగదీశ్ రెడ్డి

ఇంటర్ ఫలితాలపై రాజకీయాలొద్దు.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు : మంత్రి జగదీశ్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డి (షైల్ ఫోటో)

నిజంగానే సాంకేతికంగా తప్పులు జరిగినా ....దానికి బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించేందుకే నిపుణుల కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

  • Share this:
    ఇంటర్మీడియట్ ఫలితాలపై వస్తున్న అపోహలు,ఆందోళనలపై రాష్ట్ర విద్యాశాఖామంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.మంగళవారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. కొంతమంది దీనిని రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.అటువంటి చిల్లర ప్రయత్నాలను పసిగట్టాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.అంతర్గత తగదాలతో వచ్చిందా ....లేదా నిజంగానే ఏమైనా జరిగిందా ....? ఎందువల్ల ఇలాంటి అపోహలు వచ్చాయన్న అంశంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో నిజంగానే సాంకేతికంగా తప్పులు జరిగినా ....దానికి బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించేందుకే నిపుణుల కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మొత్తం వ్యవహారం లో ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమని మంత్రి స్పష్టం చేశారు.

    నిపుణుల కమిటీ కూడా వేగవంతంగా పనిచేస్తుందన్నారు. రెండురోజుల్లో నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరవచ్చన్నారు. ఆ నివేదిక ఆధారంగా తప్పు తేలితే దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అదే సమయంలో సంయమనం పాటించాల్సిన రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయాన్నారు. దయచేసి పిల్లలు, తల్లి తండ్రులు ఆందోళనకు గురికావొద్దని ఆయన అభ్యర్ధించారు. తప్పులు జరిగిందా లేదా అన్నది నివృత్తి కాకుండానే విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు.
    ఇది సరైన పద్ధతి కాదని మంత్రి జగదీష్ రెడ్డి విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా రీ-వాలిడేషన్ ,రీ-కౌంటింగ్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు .
    First published: