HOME »NEWS »POLITICS »telangana minister jagadeeshwar reddy stucks in pump house lift at kaleshwaram project sk

కాళేశ్వరం లిఫ్ట్‌లో చిక్కుకున్న మంత్రి...అద్దాలు పగులగొట్టి..

కాళేశ్వరం లిఫ్ట్‌లో చిక్కుకున్న మంత్రి...అద్దాలు పగులగొట్టి..
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్

ఎంతసేపటికీ లిఫ్ట్ తెరచుకోకపోవడంతో కాసేపు ఆందోళన నెలకొంది. అధికారులు సైతం కంగారు పడ్డారు. చివరకు లిఫ్ట్ తలుపుల అద్దాలను పగులగొట్టి మంత్రిని బయటకు తీసుకొచ్చారు.

  • Share this:
    తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అనుచరులతో పాటు ఆయన లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించేందుకు జగదీశ్వర్ రెడ్డి వెళ్లారు. తన అనుచరులతో కలిసి పంప్‌హౌస్‌లోని లిఫ్ట్ ఎక్కిన ఆయన అందులో చిక్కుకుపోయారు. పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడంతో లిఫ్ట్ స్తంభించిపోయింది. ఎంతసేపటికీ లిఫ్ట్ తెరచుకోకపోవడంతో కాసేపు ఆందోళన నెలకొంది. అధికారులు సైతం కంగారు పడ్డారు. చివరకు లిఫ్ట్ తలుపుల అద్దాలను పగులగొట్టి మంత్రిని బయటకు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కరిగా అందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. ఆ తర్వాత టెక్నీషియన్స్ వచ్చి లిఫ్ట్‌కు మరమ్మతులు చేశారు.

    telangana loksabha election 2019, telangana election 2019, uttam kumar reddy, minister jagadeswar reddy, trs vs congress, trs, congress, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్, కాంగ్రెస్, లోక్ సభ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు
    జగదీష్ రెడ్డి( Facebook Image)


    Published by:Shiva Kumar Addula
    First published:June 21, 2019, 21:16 IST