• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA MINISTER JAGADEESH REDDY TO FACE DOUBLE CHALLENGE FROM MLC AND NAGARJUNA SAGAR BY ELECTIONS HERE IS THE DETAILS AK

Telangana: కేసీఆర్ కేబినెట్‌లోని ఆ మంత్రికి డబుల్ పరీక్ష.. కష్టకాలమే..

Telangana: కేసీఆర్ కేబినెట్‌లోని ఆ మంత్రికి డబుల్ పరీక్ష.. కష్టకాలమే..

సీఎం కేసీఆర్

Telangana: ఈ రెండు ఎన్నికల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. జగదీష్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ తగ్గే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    తెలంగాణలో ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ వెంటనే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికలు అధికార టీఆర్ఎస్‌కు ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పవనరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీని నిలువరించగలిగితేనే.. ఆ పార్టీ దూకుడుకు కళ్లెం పడుతుందని.. లేకపోతే బీజేపీ మరింతగా తమపై రాజకీయ దాడి చేస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈ రెండు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహాలను అమలు చేసే విషయంలో తెలంగాణలోని మంత్రులందరూ పాలుపంచుకుంటున్నా.. ఈ విషయంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రుల్లో ఒకరైన జగదీష్ రెడ్డికి డబుల్ పరీక్ష ఎదురుకానుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు మెజార్టీ ఓట్లు సాధించే బాధ్యత జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిపైనే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఇందుకోసం ఇప్పటికే ఆయన కసరత్తు కూడా మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి మరింత కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు వ్యూహరచన చేస్తున్న జగదీష్ రెడ్డి... అక్కడ టీఆర్ఎస్‌కు ఘన విజయం సాధించిపెట్టి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని రిపీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

    power bill, power bill amendment, power bill update, telangana oppose power bill by modi govt, telangana news, jagadish reddy on power bill, కేంద్రం విద్యుత్ బిల్లు, కేంద్రం విద్యుత్ చట్ట ముసాయిదా, కేంద్రం బిల్లును వ్యతిరేకించిన జగదీష్ రెడ్డి
    జగదీష్ రెడ్డి( Facebook Image)


    అలా చేయడం వల్ల పార్టీలో తన ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని జగదీష్ రెడ్డి భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తే.. ఆ క్రెడిట్ కచ్చితంగా జగదీష్ రెడ్డికి దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ రెండు ఎన్నికల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. జగదీష్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ తగ్గే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు