Harish Rao Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

Revanth reddy harish rao: చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. అందుకే కాంగ్రెస్ ముసుగు పెట్టుకుని మళ్లీ తెలంగాణలోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

  • Share this:
    తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని భావించిన చంద్రబాబు.. తన మనుషులను కాంగ్రెస్‌లోకి పంపి తెలంగాణలో అడుగు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తన వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నవ్యక్తి కాదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అత్యంత‌ సన్నిహితుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ‌ చీఫ్‌గా వచ్చాడని ఆరోపించారు. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. అందుకే కాంగ్రెస్ ముసుగు పెట్టుకుని మళ్లీ తెలంగాణలోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

    సిద్ధిపేట జిల్లా బెజ్జంకిలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత వేసవిలో ఒక్క గుంట ఎండలేదని అన్నారు. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మిడ్ మానేరు నింపి నీళ్లు తెచ్చుకున్నామని అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసిందని అన్నారు. ఏ చెరువు చూసిన నీటితో నిండి ఉన్నాయని... వానలు ఇంకా రాకముందే కాళేశ్వరం నీటితో నిండిపోయాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో క్రాప్ లోన్లు రావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేదని..సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలు బయట పెట్టకుండా రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని అన్నారు.

    ఎకరానికి 5 వేలు రూపాయలు.. విత్తనాలు, నాట్లు, నారుమడి వంటి ఖర్చు కోసం ఇస్తున్నారని అన్నారు. ఇలాంటివి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఏమీ ఇవ్వకపోగా ధరలు మాత్రం పెంచి పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు. డీజిల్ ధర రూ.100 చేసిందని... రైతు శ్రేయస్సుకై ఎకరానికి టీఆర్ఎస్ 5 వేలు ఇస్తే., డీజిల్ ధర పెంచి బీజేపీ రైతుల పైసలు గుంజేసిందని ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: