బంగ్లాదేశ్‌తో భారత్ పోటీ పడలేకపోతుంది.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు.. మంత్రి హరీష్ రావు

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

భారత దేశ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఎక్కువ ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

 • Share this:
  భారత దేశ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఎక్కువ ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ హయాంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు బంగ్లాదేశ్ వృద్ధిరేటు కంటే తక్కువగా ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1887 డాలర్లు కాగా, భారత్‌ తలసరి ఆదాయం 1877 డాలర్లని అని తెలిపారు. తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని మంత్రి అన్నారు. గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ది, స్థితిగతులకు సంబంధించి మంత్రి హరీశ్ రావు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,37,632గా ఉందని తెలిపారు. ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ అని అన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే దక్షిణాదిన నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు.

  2014లో రాష్ట్ర తలసరి ఆదాయం పదో స్థానంలో ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది ఒక శాతం జీడీపీ పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో టాప్-3 స్థానంలో ఉందన్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ వృద్దిరేటు సాధించిందని అన్నారు. ఆరేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు రెట్టింపు అయిందని.. దేశ తలసరి ఆదాయం 48.7 శాతం పెరిగిందని అన్నారు. వీటిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

  వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో.. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే కోతలు లేని కరెంటు ఇవ్వడం మొదలుపెట్టామని అన్నారు. వరి ఉత్పత్తిలో రూ.9,528 కోట్ల నుంచి రూ.47,440 కోట్లకు ఆదాయం పెరిగిందన్నారు. పశువుల పెంపకం రంగంలో మూడు రెట్లు, చేపల పెంపకంలో ఆదాయం రెట్టింపు అయిందన్నారు. ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలు అని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నివేదికల నుంచే వివరాలు సేకరించామని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: