Home /News /politics /

TELANGANA MINISTER HARISH RAO SAID THAT ONE OR TWO VILLAGES WILL SELECT FOR DALITH BANDHU SCHEME IN EVERY CONSTITUENCY PRV

Dalith bandhu: ప్రతీ నియోజక వర్గంలో ఒకటి లేదా రెండు గ్రామాలు దళిత బంధుకు ఎంపిక.. మంత్రి హరీశ్​ రావు వెల్లడి

హరీశ్​రావు (ఫైల్​)

హరీశ్​రావు (ఫైల్​)

దళిత బంధుపై ఇటీవలె సీఎం కేసీఆర్​ మంత్రి మండలిలో చర్చించారు. కాగా, జ్వరం సర్వే కార్యక్రమాల్లో ఉన్న మంత్రి హరీశ్​రావు (Minister harish rao) దళిత బంధుపై మాట్లాడారు

తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు (Dalith bandhu) కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు (Dalith Bandhu)ను రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 118 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. కాగా, జ్వరం సర్వే కార్యక్రమాల్లో ఉన్న మంత్రి హరీశ్​రావు (Minister harish rao) దళిత బంధుపై మాట్లాడారు. నియోజకవర్గంలో 100 మంది చొప్పున దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే నియోజకవర్గంలోని ఏ ఊరును ఎంపిక చేసి... పంపాలన్నది.. ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.

మార్చి 31వ తేదీలోపు..

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో దళితబంధు (Dalith Bandhu) పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr) ఆదేశించారని మంత్రి హరీశ్ రావు  ఈ సందర్భంగా చెప్పారు. ఈ మేరకు మార్చి 31వ తేదీలోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నట్టు వెల్లడించారు. దళితబంధు పథకం మీద సంగారెడ్డి (sanga reddy)లో ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేసినట్లు హరీశ్​ వెల్లడించారు. కలెక్టర్‌ ఖాతాలో నిధులు జమ అయ్యాయన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని  హరీశ్ రావు (Minister harish rao) హామీ ఇచ్చారు. ఎంతో మంది దళితబంధు (Dalith bandhu)పై విమర్శలు గుప్పించారని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీని.. నిలబెట్టుకుంటున్నారన్నారు.

జిల్లా మంత్రి అధ్యక్షతన..

టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) ఇచ్చిన మాట ప్రకారమే.. దళిత బంధు అమలు చేస్తుందన్నారు హరీశ్​. విమర్శలు చేసేవారు ఇప్పటివరకైనా మానుకోవాలని హితవు పలికారు. రాబోయే బడ్జెట్‌లోనూ దళితబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. జిల్లా మంత్రి (Minister) అధ్యక్షతన ఎమ్మెల్యేలు.. నియోజకవర్గంలోని ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఎంపిక చేశాక.. ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత అధికారులు.. గ్రామాల్లో పర్యటించి.. లబ్ధిదారులను ఎంపిక చేస్తారని మంత్రి వెల్లడించారు.

ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి..

ఎంపిక ప్రక్రియ, బ్యాంకు అకౌంట్లు తెరవడం ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని మంత్రి హరీశ్​ చెప్పారు. త్వరగా ఈ పని పూర్తయితే.. మార్చి మొదటి వారం కల్లా యూనిట్లను గ్రౌండ్‌ చేయాలన్నారు. దీనికోసం రెండు నెలల గడువే ఉన్న కారణంగా.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Dalitha Bandhu, Minister harishrao, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు