ఇది నా అదృష్టం.. అయోధ్య తీర్పుపై మంత్రి హరీష్ రావు

దేశ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య తీర్పు వచ్చిందని.. ఆ శుభవేళ సంగారెడ్డిలో సరస్వతీ సమార్చన జరగడం సంతోషంగా ఉందని చెప్పారు.

news18-telugu
Updated: November 9, 2019, 7:09 PM IST
ఇది నా అదృష్టం.. అయోధ్య తీర్పుపై మంత్రి హరీష్ రావు
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు
  • Share this:
సంగారెడ్డిలో జ్యోతిర్వాస్తు విద్యా పీఠం ఆధ్వర్యంలో సప్త సరస్వతీ సమార్చన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు హరీష్ రావు.  25 వేల దేవతామూర్తులతో సంగారెడ్డిలో ఆలయ నిర్మాణం జరగడం సంగారెడ్డి ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. పూర్వకాలంలో రాతి కట్టడాల గురించి విన్నామని.. ఇక్కడ మహేశ్వర సిద్ధాంతి నిర్మించి చూపిస్తున్నారని ప్రశంసలు కురిపించారు హరీష్ రావు.

మానసిక ప్రశాంతత కేవలం దైవ సన్నిధిలోనే పొందగలుగుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు హరీష్ రావు. ఎంత చేసినా, ఎన్ని పదవులు అనుభవించినా మానసిక ప్రశాంతత లేకుంటే అంతా వృధానే అని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య తీర్పు వచ్చిందని.. ఆ శుభవేళ సంగారెడ్డిలో సరస్వతీ సమార్చన జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. రామ మందిరంపై తీర్పు వచ్చిన రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం.. తన అదృష్టమని అ న్నారు హరీష్ రావు.

 

 

First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>