ఏపీ రాజకీయాల్లో హరీష్ రావు.. హాట్ టాపిక్ ఇదే..

Harish Rao : నిన్న, మొన్నటి వరకు తెలంగాణలోనే హాట్ టాపిక్‌గా ఉన్న మంత్రి హరీష్ రావు.. ఇప్పుడు ఏపీ వరకు వెళ్లారు. ఏపీలో ఎవరి నోట విన్నా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు.

news18-telugu
Updated: January 23, 2020, 10:25 AM IST
ఏపీ రాజకీయాల్లో హరీష్ రావు.. హాట్ టాపిక్ ఇదే..
హరీష్ రావు (File)
  • Share this:
నిన్న, మొన్నటి వరకు తెలంగాణలోనే హాట్ టాపిక్‌గా ఉన్న మంత్రి హరీష్ రావు.. ఇప్పుడు ఏపీ వరకు వెళ్లారు. ఏపీలో ఎవరి నోట విన్నా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, విశ్లేషకులు ఆయన చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చించుకుంటున్నారు. ‘ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి’ అన్న మాటలే ఇప్పుడు ఏపీలో చర్చకు దారి తీశాయి. ఏపీ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు ఇలా పలు రంగాలకు చెందినవారు హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తితో ఉన్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. దేశంలోని ఇతర పట్టణాలతో పోలిస్తే హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారానికి అనువైన ప్రాంతమని అన్నారు. ఈ పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో.. జగన్, చంద్రబాబు మధ్య జరుగుతున్న వార్.. ఏపీకి ప్రతికూలంగా మారుతుందా? అని అక్కడి ప్రజలు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. హరీష్ రావుతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ‘ఏపీ కుప్పకూలే పరిస్థితిలో ఉంది. దాంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది’ అని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఏపీ ప్రజల్ని డైలమాలో పడేశాయి. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హాట్ టాపిక్‌గా మారారు హరీష్ రావు. మరి దీనిపై మంత్రి స్పందిస్తారో.. లేదో.. వేచి చూడాలిక.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు