Home /News /politics /

TELANGANA MINISTER HARISH RAO MADE SATIRES ON BJP CHIEF BANDI SANJAY OVER MILLION MARCH ON BUDGET SESSION PRV

Minister Harish rao: మిలియన్​ మార్చ్​ గల్లీలో కాదు.. దమ్ముంటే ఢిల్లీలో చెయ్​.. బండి సంజయ్​పై మంత్రి హరీశ్​ రావు విమర్శలు

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో మిలియన్​ మార్చ్​ చేపట్టనున్నట్లు బండి సంజయ్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్​ రావు సంజయ్​ను ఎద్దేవా చేశారు.

తెలంగాణ (Telangana)లో గత కొంత కాలంగా బీజేపీ, టీఆర్​ఎస్​ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టీఆర్​ఎస్​ కుటుంబ పాలన చేస్తుందంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తూ ఉంది. అయితే గత ఎన్నికల వరకు అంతగా ప్రభావం చూపని బీజేపీ కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బలంగా పాతుకుపోతోంది. బండి సంజయ్​ బీజేపీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో నూతనొత్తేజం మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీని తెలంగాణలో గట్టిగా తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​పై దఫదఫాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో మిలియన్​ మార్చ్​ చేపట్టనున్నట్లు బండి సంజయ్ (Bandi sanjay)​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్​ రావు (Minister Harish rao) సంజయ్​ను ఎద్దేవా చేశారు. హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే దిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని బీజేపీకి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kottagudem District)లో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish rao)  శనివారం పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో బీజీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారన్నారు. దొంగే దొంగ అన్నట్లు బీజేపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు.

ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు..?

'అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు...? ఇవ్వంది ఎవరు..?. నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా?. బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి. గాలి మాట‌లు కాదు ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి. బీజేపీ హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా? నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా? బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలి. హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు బండి సంజయ్...ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయి దమ్ముంటే' అని మంత్రి హారీశ్  రావు  (Minister Harish rao) అన్నారు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, నిరుద్యోగ భారత్ గా మారుస్తుందని మంత్రి హరీశ్  (Minister Harish rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయన్నారు. జనవరి 20న సీఎంఐఈ వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం అన్నారు. దేశంలో గత డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపిందన్నారు. ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్‌ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుందని సీఎంఐఈ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. '

ఇప్పటి వ‌ర‌కు 1,32,899 ఉద్యోగాల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందని మంత్రి  (Minister Harish rao) ప్రకటించారు. మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ భ‌ర్తీకి క‌స‌రత్తు చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో అమ‌ల్లో ఉన్నప్పటి నాన్ లోక‌ల్ విధానాన్ని ర‌ద్దు చేసి తెలంగాణ ప్రజ‌ల‌కే వంద శాతం ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ర్యలు చేప‌ట్టమన్నారు.

ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందన్నారు. తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355, సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థల ద్వారా 6,648 పోస్టులు, డీసీసీబీలు 1571, టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టుల‌ు భ‌ర్తీ చేశామన్నారు.

95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ల‌భించేలా కొత్త జోన‌ల్ విధానాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. అందుకోసం 317 జీవోను విడుదల చేశామని మంత్రి  (Minister Harish rao) స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొత్త ఖాళీలు గుర్తించి నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక‌తో వేస్తుందన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bandi sanjay, Bhadrari kothagudem, Harish Rao, TRS leaders

తదుపరి వార్తలు