TELANGANA MINISTER HARISH RAO FIRED ON BJP OVER DALITH BANDHU ISSUE AND HE ACCUSED THE CENTRAL GOVERNMENT OF DOING INJUSTICE TO SCS AND STS MDK PRV
Harish rao: బీజేపీపై మంత్రి హరీశ్ ఫైర్.. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆగ్రహం
harish rao file photo
బీజేపీ (BJP) నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని ఎద్దేవా చేశారు
దళిత బంధు (Dalith bandhu) లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి మొదటి వారం లోగా పూర్తికావాలని, మార్చ్ మొదటి వారం లో యూనిట్లు గ్రౌండ్ కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీశ్ రావు (Minister harish rao) అన్నారు. అందుకనుగుణంగా ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధు ఇస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు. బీజేపీ (BJP) నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Harish rao) అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ ను 'హర్ ఘర్ జల్ ' పేరుతో, రైతు బంధు ను కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో కేంద్రం అమలు చేస్తోందని ఆరోపించారు మంత్రి హరీశ్. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ప్రవేశ పెట్టిన దళిత బంధు ను కూడా దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు (harish rao) మాట్లాడుతూ.. ‘‘ దేశం లో ఉన్న 26 కోట్ల దళితులకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి, వారి కోసం దళిత బంధు (Dalith bandhu) ప్రకటించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను డిమాండ్ చేస్తున్నా. పదేళ్లలో దళితుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 6,198 కోట్లు ఖర్చు పెడితే ఈ ఏడున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం 24,114 కోట్లు ఖర్చు పెట్టింది.
ఆంగ్ల మాధ్యమం అనగానే ఆగమాగమైపోతున్నారు..
బీజేపీ ప్రభుత్వం (BJP Government).. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు పెట్టి ఎస్సి, ఎస్టీ లకు అన్యాయం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో " మన ఊరు- మన బడి" పేరుతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతానాని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అనగానే బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు ఆగమాగమైతున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని బీజేపీ (BJP), కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు.
బీజేపీ అంటేనే కార్పొరేట్ పార్టీ గా పేరుంది. ప్రభుత్వం బడుల్లో ఇంగ్లీష్ మీడియం (English medium) పై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న మీరు కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లకు మద్దతు తెలుపదలుచుకున్నారా అనేది బండి సంజయ్ స్పష్టం చేయాలి.
రాష్ట్రం ఏర్పడ్డ నాడు 296 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఇప్పుడు 914 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central government) చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ విద్యాలయం ఉండాలి. మన రాష్ట్రానికి ఇంకా 21 నవోదయ విద్యాలయాలు రావాలి. బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నవోదయ విద్యాలయాలు, ట్రైబల్ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ తీసుకురావాలని డిమాండ్ చెస్తున్నా.
ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలు లేక..
ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ (central government) ఉద్యోగ పోటీ పరీక్షలు లేకపోవడం కారణంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం జరుగుతుందని, కేవలం హిందీ లో కాకుండా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాని ఒప్పించాలి.
మన రాష్ట్రం లో 1,03,657 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేరని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ అక్కసును, గుడ్డి వ్యతిరేకత ను ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ తెస్తా అన్నాడు తెచ్చి చూపిండు, మిషన్ భగీరథ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు లాంటి పథకాలు తెస్తామన్నారు, తెచ్చి చూపారు. అదే తరహాలో మన ఊరు-మన బడి తెస్తామని కేసీఆర్ చెప్పిండు, తెచ్చి చూపిస్తాడు " అని అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.