Harish Rao: ఈటల భాష మారింది.. ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న మంత్రి హరీశ్ రావు

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Harish Rao: రెండు గుంటలన్న గెల్లు శ్రీనుకు, 200 ఎకరాలు ఉన్న ఈటలకు మధ్య పోటీ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

 • Share this:
  కేసీఆర్‌ను తనపై పోటీ చేయాలన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారని హరీశ్ రావు అన్నారు. అలాంటి కేసీఆర్‌ను రా అని ఈటల అంటున్నారని విమర్శించారు. బీజేపీలో చేరాక ఈటల భాష మారిందని అన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజలు ఓడిపోతారని.. పెంచిన తల్లిదండ్రుల గుండెలపైనే కొడుకు తన్నినట్టుగా ఈటల రాజేందర్ వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. అసలు ఎమ్మెల్యే పదవికి ఈటల ఎందుకు రాజీనామా చేశారని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు గుంటలన్న గెల్లు శ్రీనుకు, 200 ఎకరాలు ఉన్న ఈటలకు మధ్య పోటీ ఉందని అన్నారు. ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తానని ఈటల అంటున్నారని.. రైతుబంధు వద్దన్న ఈటల రాజేందర్ రూ. 10 లక్షలు ఎందుకు తీసుకున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు.

  హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు ఖాయమైందని హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌ మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. దత్తత గ్రామం సిరిసేడులోనూ ఏ ఒక్క పనిచేయలేదన్నారు. మంత్రిగా పనిచేయని ఈటల ఇప్పుడేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. అసహనంతో మాట్లాడుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఏమైనా అభివృద్ధి చేశారా? రూ.10 లక్షల పని కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్‌ ధర.రూ.105కు చేరిందన్నారు.

  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని మంత్రి హరీశ్‌ అన్నారు. కాళేశ్వరం వచ్చాక నిండు ఎండల్లో కూడా నీరు పారిందన్నారు. కాళేశ్వరం తొలిఫలితం హుజూరాబాద్‌ ప్రజలకే దక్కిందన్నారు. రూ.10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
  Published by:Kishore Akkaladevi
  First published: