టీఆర్ఎస్‌ని వీడుతారని ప్రచారం.. తెలంగాణ మంత్రి రియాక్షన్

తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందని.. ఇద్దరు మంత్రులపై వేటు పడుతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో ఈటల రాజేందర్ కూడా ఉన్నారని.. వేటు పడితే ఆయన పార్టీ మారతారని పుకార్లు షికార్లు చేశాయి.

news18-telugu
Updated: November 22, 2019, 8:10 PM IST
టీఆర్ఎస్‌ని వీడుతారని ప్రచారం.. తెలంగాణ మంత్రి రియాక్షన్
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
టీఆర్ఎస్‌లో మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఈటెల రాజేందరే క్లారిటీ ఇచ్చి.. ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి. గాలి వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఇక తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందని.. ఇద్దరు మంత్రులపై వేటు పడుతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో ఈటల రాజేందర్ కూడా ఉన్నారని.. వేటు పడితే ఆయన పార్టీ మారతారని పుకార్లు షికార్లు చేశాయి.

Telangana Government will work for karimnagar people benefits says Etela Rajender
ఈటెల రాజేందర్


కొన్ని రోజుల క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని, ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని ఈటల గతంలో వ్యాఖ్యానించారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని అన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్నీ కాదని, బతికొచ్చినోన్నీ కాదని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్ళం కాదని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత స్వయంగా కేసీఆర్ కలగజేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా మరోసారి ఈటల పార్టీ మారుతున్నారని ప్రచారం జరగడంతో.. ఆయన ఖండించారు.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు