• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA MINISTER ETELA RAJENDAR INTERESTING COMMENTS ON YS SHARMILA NEW POLITICAL PARTY AK

Telangana: షర్మిల కొత్త పార్టీపై మంత్రి ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: షర్మిల కొత్త పార్టీపై మంత్రి ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

ఈటల రాజేందర్, వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

Telangana: కొత్తగా వచ్చే వాళ్లకు ఈ ప్రాంతంలో ఏం సంబంధమని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. సెంటిమెంట్స్‌ ఎక్కువకాలం పనిచేయవని స్పష్టం చేశారు.

  • Share this:
    తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారనే వార్తలపై ఇతర పార్టీ నేతల తరహాలోనే టీఆర్ఎస్ నాయకులు సైతం ఆచితూచి స్పందిస్తున్నారు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడ స్థానం.. ఎవరొచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఏమీ కాదని టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా షర్మిల కొత్త పార్టీపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ షర్మిల కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని ఆయన పరోక్షంగా షర్మిల కొత్త పార్టీపై కామెంట్ చేశారు. మనిషి గురించి ఆలోచించేవారికే ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. కొత్తగా వచ్చే వాళ్లకు ఈ ప్రాంతంలో ఏం సంబంధమని ప్రశ్నించారు. సెంటిమెంట్స్‌ ఎక్కువకాలం పనిచేయవని ఈటల స్పష్టం చేశారు. మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాలవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలు ఆగిపోవాలని వ్యాఖ్యానించారు.

    అయితే షర్మిల కొత్త పార్టీపై పరోక్షంగా స్పందించిన మంత్రి ఈటల రాజేందర్.. మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని అనడం కొత్త చర్చకు దారి తీస్తోంది. షర్మిల కొత్త పార్టీ ఓ వర్గం ఓటర్లను ఆకర్షించేలా ఉంటుందనే విషయంలో టీఆర్ఎస్ అప్పుడే ఓ క్లారిటీగా వచ్చిందేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. షర్మిల భర్త బద్రర్ అనిల్ ఆమె కొత్త పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఆయన తమ కొత్త పార్టీ వైపు క్రిస్టియన్ వర్గాన్ని ఆకర్షిస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? లేక టీఆర్ఎస్ పార్టీ అనుమానాలనే ఆయన వ్యక్తం చేశారా ? అన్నది తెలియాల్సి ఉంది.

    కొద్దిరోజుల క్రితమే వైఎస్ అభిమానులు, పలువురు సన్నిహితులతో సమావేశమైన వైఎష్ షర్మి.. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023లో దాదాపుగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ పాలనను తిరిగి తీసుకురావడమే తన ఎజెండా అని షర్మిల తెలిపారు. జగన్‌తో విభేదాల నేపథ్యంలోనే షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వచ్చిన వార్తలపై షర్మిల స్పందించారు. తాను తెలంగాణలో పెట్టబోతున్న రాజకీయ పార్టీకి తన అన్నయ్య జగన్ మద్దతు లేదని ఎందుకు అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ తన సోదరుడని.. ఆయన పార్టీకి తాను మద్దతు తెలిపానని, తన పార్టీకి కూడా ఆయన మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు షర్మిల తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు