• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA MINISTER ETALA RAJENDAR SPECIAL MEETING WITH CM K CHANDRASHEKAR RAO AK

Telangana: సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల సమావేశం.. ఏం జరుగుతోంది ?

Telangana: సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల సమావేశం.. ఏం జరుగుతోంది ?

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etala Rajendar: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ స్వయంగా సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారనే ఊహాగానాలు కూడా మొదలయ్యయి.

  • Share this:
    తెలంగాణలో కొంతకాలంగా మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను ఉద్దేశించినవే అని.. ఆయన సొంత ప్రభుత్వం విధానాలనే ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నారనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నాయకత్వం సైతం ఈటల రాజేందర్‌ను పక్కనపెట్టిందని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయనకు ఎక్కడా గెలుపు బాధ్యతలను అప్పగించలేదనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ స్వయంగా సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారనే ఊహాగానాలు కూడా మొదలయ్యయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఈ అంశంపైనే సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు కలిశారని పలువురు చెబుతున్నారు. కానీ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడారనే టాక్ వినిపిస్తోంది.

    అంతకుముందు నిన్న కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ ఆకారం, ఒండి నిండా బంగారం ఉంటే సరిపోదని, ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలని అన్నారు. న్యాయం, ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినా.. అంతిమంగా మాత్రం విజయం సాధిస్తాయని పేర్కొన్నారు. ''కులం, డబ్బు, పార్టీ కాదు మనిషి గుర్తుండాలి. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం వాటిదే. నేను గాయపడినా ఎన్నడూ మనసు మార్చుకోలేదు. 20 ఏళ్ల ప్రస్థానంలో నన్ను ప్రజలు ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఊరంతా ఒకదారైతే ఊసరవెల్లిది ఇంకో దారి అనట్లుగా కొందరు ఉంటారు. మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది. రామాయణంలో కూడా రాముడు, రావణుడు ఇద్దరూ ఉన్నారు. అలాగే సమాజంలో కూడా అందరూ ఉంటారు. సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఒకవేళ ఉంటే అది సమాజం కాదు. భారీ ఆకారం, ఒంటి నిండా బంగారం ఉంటే సరిపోదు. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించేవాడే నిజమైన నాయకుడు.'' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు