కేసీఆర్‌పై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 31, 2019, 1:54 PM IST
కేసీఆర్‌పై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
ఎర్రబెల్లి దయాకర్ రావు, కేసీఆర్
  • Share this:
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి... మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కేసీఆరే గులాబీ జెండాను తయారు చేశారని తెలిపారు. ఈటల రాజేందర్ అంశం సమసిపోయిందని... ఆయన పదవికి ఢోకాలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ ఉద్యమానికి ఎంతో సపోర్ట్ చేశానని... టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు మద్దతుగా లేఖ ఇప్పించానని అన్నారు. రెండు రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గులాబీ జెండాకు తాము ఓనర్లమన్న ఈటల రాజేందర్... మంత్రి పదవి బిక్ష కాదని అన్నారు. అయితే ఆ తరువాత తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కేసీఆరే తమ నాయకుడు అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading