Home /News /politics /

TELANGANA MINISTER AND TRS KEY LEADER HARISH RAO FOCUS ON HUZURABAD BY ELECTION TO DEFEAT ETELA RAJENDAR AK

Harish Rao: ‘హుజూరాబాద్‌’పై హరీశ్ రావు ఫోకస్.. ఆ నేత ఎంట్రీతో క్లారిటీ..

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Harish Rao: టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ రావు.. పార్టీని ఇలాంటి చోట్ల గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.

    హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ఎంతో సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. మళ్లీ బీజేపీ తరపున ఇక్కడి గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పుడే నియోజకవర్గంలో పాదయాత్ర కూడా మొదలుపెట్టి అక్కడి ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సపోర్ట్‌తో హుజూరాబాద్‌లో గెలవాలని ఈటల రాజేందర్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఈటలకు చెక్ చెప్పేందుకు టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలు హుజూరాబాద్‌లో పర్యటిస్తూ.. అక్కడి ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఈ విషయంలో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ ముందున్నారు. అయితే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది గంగుల కమలాకరే అయినా... అక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టింది మాత్రం హరీశ్ రావే అని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ రావు.. పార్టీని ఇలాంటి చోట్ల గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం హరీశ్ రావు సక్సెస్ కాలేకపోయారు. దీంతో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపించి మరోసారి తన సత్తా చాటాలని హరీశ్ రావు భావిస్తున్నట్టు సమాచారం.

    నిన్న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం మొత్తాన్ని హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఒకప్పుడు మంత్రివర్గంలో తనకు అత్యంత సన్నిహిత సహచరుడిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఓడించడంలో హరీశ్ రావు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Harish Rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు