మీడియా స్కాన్: మహాకూటమిలో టికెట్ల లొల్లి.. త్వరగా తేల్చాలంటున్నటీజేఎస్!

కరీంనగర్ జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. ఈ వార్తను ప్రముఖంగా పత్రికలన్నీ ప్రచురించాయి. కరీంనగర్ జిల్లాలో కులహత్య కలకలం రేపుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి సంబంధించిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది.

news18-telugu
Updated: October 10, 2018, 8:25 AM IST
మీడియా స్కాన్: మహాకూటమిలో టికెట్ల లొల్లి.. త్వరగా తేల్చాలంటున్నటీజేఎస్!
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల సమావేశం (File)
  • Share this:
తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల గొడవ షురూ అయ్యింది. దీనికి సంబంధించిన వార్తను ప్రముఖంగా పత్రికలన్నీ పబ్లిష్ చేశాయి. తమకు కేటాయించే స్థానాల్లో 48గంటల్లో స్పష్టత ఇవ్వాలంటూ... కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి టీజేఎస్ అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తామే 21 మందితో జాబితానుప్రకటిస్తామన్నారు కోదండరాం. తమ సీట్ల సంగతి వెంటనే తేల్చాయాలంటూ డిమాండ్ చేశారాయన. ఒక మెట్టు దిగేందుకు సిద్ధమైన సీట్లపై నాన్చుడి ధోరణి ఎందుకంటూ ప్రశ్నించారు కోదండరాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారాయన. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు కోదండరాంను బుజ్జగిస్తున్నాయి. తొందరపడొద్దని సూచిస్తున్నారు పలువురు నేతలు.

ఇక దీంతో పాటు చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరష్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రధాన పత్రికలన్నీ ప్రముఖంగా పబ్లిష్ చేశాయి. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ హరీష్ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తితో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ , బాబుతో జతకట్టడంపై మంత్రి విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీతో పొత్తుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాని విమర్శించారు. చంద్రబాబు ఏనాడు తెలంగాణ పక్షపాతి కాదన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీకి సంబంధించిన వివాదం వస్తే ఆయన ఎవరి పక్షాన నిలుస్తారని ప్రశ్నించారు.

ఇక వీటితో పాటు.. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి సంబంధించిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. అవును తప్పుడు హామీలిచ్చాం అంటూ హెడ్ లైన్‌‌తో ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సొంత బీజేపీ ప్రభుత్వాన్నే తీవ్ర ఇరకాటంలో పడేశారు. కమలనాథులపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ చేతికి స్వయంగా మరో అస్త్రాన్ని అందించారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చేసిందని దాపరికం లేకుండా చెప్పేశారు. ఆ హామీలు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించాయని, వాటిని నెరవేర్చే ప్రయత్నం జరగలేదన్నారు. దీంతో ఇప్పుడు గడ్కరీ వ్యాఖ్యలతో మోడీ,అమిత్ షా అండ్ కో తలలు పట్టుకుంటున్నారు. కలర్స్ ఛానల్‌లో ప్రసారమయ్యే అసల్ పవానే-ఇర్సల్ నమూనే అనే రియల్టీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానా పటేకర్‌తో సంభాషిస్తూ.. గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు.

క్రైమ్ వార్తల విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. ఈ వార్తను ప్రముఖంగా పత్రికలన్నీ ప్రచురించాయి. కరీంనగర్ జిల్లాలో కులహత్య కలకలం రేపుతోంది. శంకర్ పట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమార్ తాడికల్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా కుమార్‌ను ప్రేమించింది. దీంతో అమ్మాయి తరపున బంధువులు కుమార్‌ను హెచ్చరించారు. అమ్మాయి వెంట పడటం మానుకోకపోతే... చంపేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కుమార్ మ‌ృతదేహం పత్తిచేనులో గుర్తించారు. ఒంటిపై గాయాలుండటంతో.. అమ్మాయి తరపువాళ్లే చంపేశారని ఆరోపించారు. రహదారిపై ఆందోళనకు దిగారు.
Published by: Sulthana Begum Shaik
First published: October 10, 2018, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading