హోమ్ /వార్తలు /politics /

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ.. తాజాగా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించి గులాబీ పార్టీని సవాల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందా ? అనే చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...

2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు తెలంగాణలో నాలుగు సార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య మరణంతో దుబ్బాక, నాగార్జునసాగర్, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ.. తాజాగా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించి గులాబీ పార్టీని సవాల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు.

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై కోర్టులో కేసు కొనసాగుతోంది. దీనిపై చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అక్కడ మళ్లీ ఉప ఎన్నిక వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓ టీవీ ఛానల్ డిబేట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. అక్కడ కూడా తామే కచ్చితంగా గెలుస్తామని అన్నారు. ఈటల రాజేందర్ గెలుపు తరువాత ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రఘునందన్ రావు తెలిపారు. తమను మళ్లీ గెలిపించుకునే బాధ్యత తీసుకుంటే.. తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్లు తనతో చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

raghunandanrao coments on muslims
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(ఫైల్ ఫోటో)

వారితో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఎమ్మెల్యేల రాజీనామాలు ఎలా ఉన్నా.. వేములవాడకు ఉప ఎన్నిక కచ్చితంగా వస్తుందనే ధీమాతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి సైతం తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధం కావాలని అన్నట్టుగా వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?

ఈ కేసు విచారణ వేగవంతమై సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పేతే.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. అది కేటీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంటుంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.

First published:

Tags: Bjp, Huzurabad By-election 2021, Telangana, Trs, Vemulawada

ఉత్తమ కథలు