• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA MAY GET A NEW GOVERNOR ESL NARASIMHAN WILL BE CHANGE SB

తెలంగాణ గవర్నర్ మార్పు... నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ?

తెలంగాణ గవర్నర్ మార్పు... నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ?

గవర్నర్ నరసింహన్(ఫైల్ ఫోటో)

తాజాగా నరసింహన్ కూడా తాను బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు ఇచ్చారు.

  • Share this:
    తెలంగాణ గవర్నర్ నరసింహన్ మార్పు తథ్యమనిపిస్తోంది. ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి... కేరళ గవర్నర్‌ సదాశివంను నియమించే అవకాశం ఉందని సమాచారం. నరసింహన్ మార్పుపై నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా, తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన రికార్డు నరసింహన్‌కు ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా కూడా ఆయన గుర్తింపు పొందారు. దాదాపు పదేళ్లుగా తెలంగాణ గవర్నర్‌గా ఆయన కొనసాగుతున్నారు.

    తాజాగా నరసింహన్ కూడా తాను బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. తాను గవర్నర్‌గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్‌ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ఏదో సరదాగా ఈ మాట అన్నారా ? లేక తన బదిలీపై ఆయనకు స్పష్టమైన సమాచారం ఉందా ? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ఇవాళ తెలంగాణ గవర్నర్ బదిలీపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉండటంతో నరసింహన్ మార్పు తప్పదని చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
    First published:

    అగ్ర కథనాలు