‘మహబూబ్‌నగర్ సీటు నాదే’... కాంగ్రెస్‌తో టచ్‌లో లేనన్న టీఆర్ఎస్ ఎంపీ

మహబూబ్‌నగర్ సీటు తనదే అని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌తో టచ్‌లో లేనని వ్యాఖ్యానించారు. తానంటే గిట్టనివారే తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని జితేందర్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: March 14, 2019, 4:03 PM IST
‘మహబూబ్‌నగర్ సీటు నాదే’... కాంగ్రెస్‌తో టచ్‌లో లేనన్న టీఆర్ఎస్ ఎంపీ
జితేందర్ రెడ్డి
  • Share this:
రాబోయే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ సీటు తనదే అని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌తో టచ్‌లో లేనని వ్యాఖ్యానించారు. తానంటే గిట్టనివారే తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని జితేందర్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌కు వ్యతికమని... ఆ పార్టీతోనే పోరాడానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశానని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు.

పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన ఒకరిద్దరికి తప్పితే... మిగతా సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు గ్యారంటీ అని కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆ ఒకరిద్దరు ఎవరనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ టికెట్ నిరాకరించబోయే వారి జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికలు ముందు విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు జితేందర్ రెడ్డి ప్రయత్నించారనే ప్రచారం కూడా సాగింది. దీనికి తోడు పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం జితేందర్ రెడ్డి కృషి చేయలేదనే అపవాదు కూడా ఉంది. దీంతో ఆయనకు మరోసారి టీఆర్ఎస్ తరపున టికెట్ వచ్చే అవకాశం లేదనే వాదనలు ఊపందుకున్నాయి. దీనిపై స్పందించిన జితేందర్ రెడ్డి... ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు.

First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading