Adilabad Loksabha : 1952 నుంచి 2019 వరకు నియోజకవర్గ చరిత్ర..

ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సిర్పూర్, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్, ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానంతో పాటు, దీని పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్ని దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

news18-telugu
Updated: March 29, 2019, 6:02 PM IST
Adilabad Loksabha : 1952 నుంచి 2019 వరకు నియోజకవర్గ చరిత్ర..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక సంస్కృతీ, సంప్రదాయాల పుట్టిల్లుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఇది. 17 పార్లమెంటు స్థానాల్లో ఆది నుంచి ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి ఘనమైన చరిత్రే ఉంది. పూర్వకాలంలో ఇక్కడ జరిగే ఘనమైన ఎడ్ల సంత కారణంగా.. ఈ ప్రాంతానికి ఎదులాబాద్‌గా పేరొచ్చినట్టు, అనంతరం ఆదిలాబాద్ మారినట్టు చరిత్ర చెబుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతంతో అలరారే ప్రాంతంగా పేరొందింది ఆదిలాబాద్ జిల్లా. అనేక రాజవంశీయులు ఏలుబడిలో దినదినాభివృద్ధి సొంతం చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా.. రెండు పార్లమెంటు స్థానాలతో లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తోంది. అందులో ఒకటే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం. జిల్లాలోని ప్రముఖ పట్టణం ఆదిలాబాద్ పేరిటే ఈ పార్లమెంటు స్థానం ప్రశస్థికెక్కింది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేళవంగా ఖ్యాతి గడించింది.



(టీఆర్ఎస్ తరుపున ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ జి.నగేశ్.. Image: Facebook)



ఈ పార్లమెంటు స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సిర్పూర్, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్, ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానంతో పాటు, దీని పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్ని దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

మొదట్లో కాంగ్రెస్.. మధ్యలో టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్

1952లో భారత పార్లమెంట్‌కు జరిగిన తొలి ఎన్నికల నుంచీ ఆదిలాబాద్.. లోక్‌సభలో ప్రాతినిథ్యం కలిగి ఉంది. ఇక్కడ తొలిసారి సోషలిస్టు పార్టీ విజయకేతనం ఎగరవేసినా.. అనంతరం జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1984 వరకు జైత్ర యాత్ర కొనసాగించిన కాంగ్రెస్ పార్టీకి, అప్పుడే కొత్తగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టింది. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. ఆ తర్వాత, ఈ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకుంది.2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. 2008లో జరిగిన ఉప‌ఎన్నికల్లో ఓడిపోయింది. అనంతరం జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో ఈ స్థానం ఎస్టీ రిజర్వ్‌డ్‌గా మారింది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుని మరోసారి కైవసం చేసుకుంది టీడీపీ. ఆ పార్టీకి చెందిన అభ్యర్థి రమేశ్ రాథోడ్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి కె. రమేశ్‌పై 1,15, 087 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 3,72,268 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి కె. రమేశ్ 2,57,181 ఓట్లు సాధించారు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఈ స్థానంలో సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం నగేశ్.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేశ్ జాదవ్‌పై 1,71,098 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గడ్డం నగేశ్‌కు 4, 30, 018 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేశ్ జాదవ్ 2,58,920 ఓట్లు సాధించారు. 2009 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నేత రమేశ్ రాథోడ్ ఈసారి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నగేశ్‌పై రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు.



(కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రమేశ్ రాథోడ్.. Image : Facebook)

 

మహిళా ఓటర్లే ఎక్కువ

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 13,86, 233 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6, 87, 389 మంది ఉండగా, మహిళా ఓటర్లు 698844 మంది ఉన్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉండడం విశేషం.

1952 నుంచి 2014 వరకు ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాల వివరాలు:



































































1952-57 సి.మాధవరెడ్డి సోషలిష్టు పార్టీ
1957-62 కె.ఆశన్న కాంగ్రెస్ పార్టీ
1962-67 జి.నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1967-71 పొద్దుటూరి గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1971-77 పొద్దుటూరి గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1977-80 గడ్డం నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1984-89 సి.మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ
1989-91 పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్
1991-96 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1991-96 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
1998-99 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
1999-04 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
2004-2008 తక్కల మధుసూధనరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2008 ఉపఎన్నిక అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
2009-2014 రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ
2014 ప్రస్తుతం జి.నగేష్ తెలంగాణ రాష్ట్ర సమితి

 
First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>