నిజామాబాద్ లోక్‌సభ స్థానంపై తెలంగాణలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో వందల సంఖ్యలో రైతులు పోటిచేస్తుండడమే దీనికి కారణం..! పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతుధర కల్పించడం లేదన్న ఆగ్రహంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు రైతులు. ఐతే ఎంతమంది పోటీచేస్తున్నారన్న దానిపై కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు నిజామాబాద్‌లో పోటీచేసే ఎంపీ అభ్యర్థుల లెక్కతేలింది.
నిజామాబాద్‌లో 205 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు దాఖలుచేశారు. మంగళవారం నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. 12 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. దాంతో నిజామాబాద్‌లో మొత్తం 193 మంది పోటీ చేయనున్నారు. అంటే ప్రస్తుత ఎంపీ కవితపై 192 మంది పోటీచేస్తున్నారన్న మాట...! వీరిలో 183 మంది పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నట్లు సమాచారం.
ఒక లోక్‌సభ స్థానానికి 64 కంటే ఎక్కువ మంది పోటీచేస్తే బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ వెల్లడించారు. నిజామాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని.. 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది పోటీలో ఉన్నా గుర్తులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిజామాబాద్‌లో బ్యాలెట్ ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటేనే ఈవీఎం ఎన్నికలు జరుగుతాయి. లేదంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics, Trs