పేదలపై కాదు...పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం...వనపర్తి సభలో రాహుల్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్టీ రద్దుచేస్తామని స్పష్టంచేశారు రాహుల్ గాంధీ. వ్యాపారం చేయాలనుకునే పేదలందరికీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: April 1, 2019, 3:41 PM IST
పేదలపై కాదు...పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం...వనపర్తి సభలో రాహుల్
రాహుల్ గాంధీ
  • Share this:
తెలంగాణలో కేసీఆర్ పాలన, కేంద్రంలో మోదీ పాలన ఒకేలా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సంపన్నుల కోసమే ఇద్దరూ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మోదీ మోసంచేశారని..తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.72 వేలను ఇస్తామని వెల్లడించారు. పేదలపై కాదు.. పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. జహీరాబాద్ సభ తర్వాత వనపర్తి సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ..మరోసారి కేసీఆర్, మోదీలను టార్గెట్ చేసుకున్నారు.

అబద్ధాలు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టడమే మోదీకి తెలుసు. మోదీ పాలన, కేసీఆర్ పాలన ఒకేవిధంగా ఉంది. సంపన్నుల కోసమే ఇద్దరు నేతలు పనిచేస్తున్నారు. మోదీకి కేసీఆర్ లంచాలు ఇస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగడం లేదు. అధికారులకు లంచాలు ఇవ్వనిదే తెలంగాణలో ఏ పనీ జరగడం లేదు. మోదీ పాలనలో కార్పొరేట్ వ్యాపారులకు తప్ప...పేదలకు రుణాలు దక్కడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యాపారం చేయాలనుకునే పేదలకు రుణాలు ఇస్తాం.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు


ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని రాహుల్ గాంధీ మోసం చేశారు. కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఖాతాలో డబ్బులు వేస్తుంది. రూ.15 లక్షలు కాదు ఏడాదికి రూ. 72వేలు రూపాయలు జమ చేస్తాం. మహిళ ఖాతాల్లోనే డబ్బులు వేస్తాం. కనీస ఆదాయ పథకం (న్యాయ్) చారిత్రాత్మకమైనది. చాలా ఆలోచించి ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నాం. పేదల జీవన ప్రమాణాలు పెంచుతాం. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తాం. పేదల ఆదాయం కనీసం రూ.12వేలు ఉండేలా చేస్తాం.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్టీ రద్దుచేస్తామని స్పష్టంచేశారు రాహుల్ గాంధీ. వ్యాపారం చేయాలనుకునే పేదలందరికీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు