హోమ్ /వార్తలు /రాజకీయం /

ఆ చిలుక పలుకులు ఏవీ...బీజేపీ మేనిఫెస్టో‌పై కవిత సెటైర్

ఆ చిలుక పలుకులు ఏవీ...బీజేపీ మేనిఫెస్టో‌పై కవిత సెటైర్

మాజీ ఎంపీ కవిత (ఫైల్)

మాజీ ఎంపీ కవిత (ఫైల్)

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ పెద్ద మొత్తంలో రైతులు నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 185 పోటీలో ఉన్నారు.

  నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు పసుపు బోర్డు చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతల పసుపు బోర్డునే ప్రస్తావిస్తున్నారు. తమను గెలిపిస్తే రైతుల కష్టాలను తీరుస్తామని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ మేనిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించకపోవడంపై ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. పసుపు రైతులను బీజేపీ మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశాన్ని పెడతామన్న కమలం నేతలు ఎందుకు మాట తప్పారని ధ్వజమెత్తారు కవిత.


  పసుపు రైతుల కష్టాల గురించి ఇప్పుడు మాకు తెలుసని...మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశాన్ని పొందుపరుస్తామని బీజేపీ నేతలు చిలుక పలుకులు పలికారు. పసుపు బోర్డు అంశం పెడతామన్న రాంమాధవ్ మాటతప్పారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా పెట్టించాలని సవాల్ విసురుతున్నా. పార్లమెంట్‌లో కవిత బాగా పనిచేస్తుందనుకుంటే కారు గుర్తుకు ఓటేయండి. గత ఐదేళ్లలో పనితీరు మీకు నచ్చితే మళ్లీ నన్ను గెలిపించండి.
  కవిత, ఎంపీ
  నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ పెద్ద మొత్తంలో రైతులు నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 185 పోటీలో ఉన్నారు. దాంతో నిజామాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా ఎం3 ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగితే ఇక్కడ మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

  First published:

  Tags: Lok Sabha Election 2019, MP Kavitha, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు