టీఆర్ఎస్‌కు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయంటే? మంత్రి లెక్క ఇదే

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరూ కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలకు అవినీతి లేని వ్యవస్థ కోసం రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్ శాఖలను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి.

news18-telugu
Updated: April 25, 2019, 8:54 PM IST
టీఆర్ఎస్‌కు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయంటే? మంత్రి లెక్క ఇదే
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా ఉంది టీఆర్ఎస్. హైదరాబాద్ సీటును ఎంఐఎంకు వదిలేస్తే మిగతా అన్ని సీట్లలో తామే విజయం సాధిస్తామని గులాబీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సైతం తన లెక్కలు చెప్పుకొచ్చారు. మే 23న విడుదలయ్యే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలవడం ఖాయమని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరూ కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వర్ధన్నపేట నుంచి మూడుసార్లు, పాలకుర్తి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొంది, తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. తొలిసారి మంత్రి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్


మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజ్, సాగునీరు హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ప్రజలకు అవినీతి లేని వ్యవస్థ కోసం రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్ శాఖలను ప్రక్షాళన చేస్తామన్నారు ఎర్రబెల్లి. ఎస్సార్ఎస్పీ ద్వారా జూన్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి సాగునీరు అందిస్తామని చెప్పారు.
Published by: Shiva Kumar Addula
First published: April 25, 2019, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading