టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి...కండువా కప్పిన హరీశ్, కేటీఆర్

దక్షిణ భారత్‌లో 10 సీట్లు కూడా లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..జాతీయ పార్టీలు ఎలా అవుతాయన్నారు కేటీఆర్. బీజేపీకి 170కి మించి, కాంగ్రెస్‌కి 100కి మించి సీట్లు రావని జోస్యం చెప్పారు.

news18-telugu
Updated: April 1, 2019, 5:15 PM IST
టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి...కండువా కప్పిన హరీశ్, కేటీఆర్
హరీశ్, కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి
  • Share this:
ఎన్నికల వేళ గులాబీ దళంలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని...తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు సునీత. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపులేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాలోని భూములన్నీ సస్యశ్యామలం కాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు, పద్మాదేవేందర్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. పదవులు ఆశించి టీఆర్ఎస్‌లో చేరడం లేదు. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీలో చేరా. అందరం కలిసి పనిచేద్దాం. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ని గెలిపించాలి.
సునీత
సునీత లక్ష్మారెడ్డి చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు హరీశ్ రావు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా రావడం లేదని..మనకు మనమే పోటీయని వ్యాఖ్యానించారు. జహీరాబాద్ సభలో తెలంగాణ గురించి రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం చేసినా బీజేపీ దారుణంగా ఓడిపోయిందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు హరీశ్ రావు.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలన్నా, బయ్యారం ఉక్కుకర్మాగారం రావాలన్నా 16 లోక్‌సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలన్నారు.
సునీతకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. 16 సీట్లు గెలిచి ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా మారాలి. ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో పాలమూరు సభలో మోదీ చెప్పలేదు. బీజేపీ అభ్యర్థులను ఓడించి మోదీకి గట్టి సమాధానం పంపాలి. మిగిలిన 15 స్థానాల్లోనూ గెలుబోతున్నాం. అప్పుడే ఢిల్లీ తెలంగాణ భవన్‌కు దిగొస్తుంది.
కేటీఆర్

దక్షిణ భారత్‌లో 10 సీట్లు కూడా లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..జాతీయ పార్టీలు ఎలా అవుతాయన్నారు కేటీఆర్. బీజేపీకి 170కి మించి, కాంగ్రెస్‌కి 100కి మించి సీట్లు రావని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టంచేశారు. దేశరాజకీయాల్లో టీఆర్ఎస్ క్రీయాశీలక పాత్ర పోషించబోతోందన్నారు కేటీఆర్.
First published: April 1, 2019, 5:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading