తెలంగాణలో ఆ ఐదు ఎంపీ సీట్లు కాంగ్రెస్‌వే...రేవంత్‌రెడ్డి సహా...

లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నా..తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డే ఉండాలన్నారు జగ్గారెడ్డి.

news18-telugu
Updated: May 16, 2019, 8:41 PM IST
తెలంగాణలో ఆ ఐదు ఎంపీ సీట్లు కాంగ్రెస్‌వే...రేవంత్‌రెడ్డి సహా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెక్‌పెట్టేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని హస్తం పార్టీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు. మే 23న టీఆర్ఎస్‌కు షాక్ తగలడం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో 5 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీవేనని జగ్గారెడ్డి ధీమావ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి (మల్కాజ్‌గిరి), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ), రేణుకా చౌదరి (ఖమ్మం), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) గెలుపు ఖాయమని స్పష్టంచేశారు జగ్గారెడ్డి. వీరిలో రేణుక చౌదరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌‌కి కేంద్రమంత్రి పదవులు వస్తాయని చెప్పారు. లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నా..తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డే ఉండాలన్నారు జగ్గారెడ్డి.

sangareddy mla jagga reddy, jaggareddy to join trs, congress mlas join trs, gandra venkata ramana reddy, pondem veeraiah, cm kcr, trs working president ktr, harish rao, ktr twitter, telangana news, telangana politics, telugu news, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి, టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గండ్ర వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే , పొందెం వీరయ్య, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు,
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)


First published: May 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు