హోమ్ /వార్తలు /రాజకీయం /

Telangana Election Result 2019: ఇటు బీజేపీ... అటు కాంగ్రెస్... టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్

Telangana Election Result 2019: ఇటు బీజేపీ... అటు కాంగ్రెస్... టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్

రాహుల్ కేసీఆర్ మోదీ

రాహుల్ కేసీఆర్ మోదీ

Telangana Lok sabha election results 2019 | తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబోతున్నట్టు కౌంటింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. కాంగ్రెస్ పుంజుకోవడం... బీజేపీ అనూహ్యంగా సత్తా చాటడం... టీఆర్ఎస్‌లో కలవరాన్ని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆరు నెలలు. కేవలం ఆరు నెలలు. తెలంగాణ ఓటరు మనసు ఊహించని విధంగా మారిపోయింది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గతం కంటే ఎక్కువగా మెజార్టీ కట్టబెట్టిన తెలంగాణ ఓటర్లు... ఆరు నెలలు తిరిగేసరికి కేసీఆర్‌కు షాక్ ఇచ్చేలా తీర్పు ఇవ్వాలని డిసైడయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తీరును బట్టి తెలంగాణలో తమకు ఒకటి రెండు సీట్లు వచ్చినా గొప్పే అని భావించిన ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ... ఎన్నికల ప్రచారంపై కూడా ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదనే వాదనలు వినిపించాయి. టీఆర్ఎస్ సైతం గెలుపు ఎలాగో తమదే అనే ధీమాలో ఎన్నికలను కొంత లైట్ తీసుకుందనే ప్రచారం జరిగింది.


  రాజకీయ పార్టీల తీరు ఎలా ఉన్నా... ప్రజలు మాత్రం తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాన్ని ఇవ్వబోతున్నట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే మరో ఆసక్తికరమైన విషయం కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్ హవా బలంగా ఉంటుందని అంతా భావించిన ఉత్తర తెలంగాణలో అనూహ్యంగా బీజేపీ సత్తా చాటింది. అదిలాబాద్, కరీంనగర్‌తో పాటు కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపీ టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఈ మూడు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తమ కంచుకోట అయిన సికింద్రాబాద్ స్థానాన్ని బీజేపీ మరోసారి తమ ఖాతాలో వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది.


  ఇక ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మరోసారి చతికలబడిన కాంగ్రెస్ పార్టీ... తెలంగాణలో మాత్రం కొంతమేర ఊరట కలిగించే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒకటి రెండు సీట్లు వస్తే చాలు అనే ఉన్న కాంగ్రెస్ పార్టీ... నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. చేవేళ్ల, మల్కాజ్ గిరి, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఫలితాలు కూడా అదే విధంగా ఉందని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది.


  ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఈ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ మొదలైంది. ఒకవేళ ఈ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయినా... తమ పార్టీ తెలంగాణలో పుంజుకుందనే సంతృప్తి మిగలనుంది. అయితే ఫలితాల తీరును బట్టి చూస్తే కాంగ్రెస్ కంటే బీజేపీనే టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిందని అర్థమవుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం... బీజేపీ అనూహ్యంగా సత్తా చాటడం... టీఆర్ఎస్‌లో కలవరాన్ని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

  First published:

  Tags: Adilabad S29p01, Bhongir S29p14, Bjp, Chevella S29p10, CM KCR, Congress, Malkajgiri S29p07, Nalgonda S29p13, Nizamabad S29p04, Secunderabad S29p08, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs

  ఉత్తమ కథలు