ఆశించిన సీట్లు రాలేదు...తెలంగాణ ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ఫైల్ ఫోటో)

తమకు ఎవరితోనూ శత్రుత్వాలు లేవని..పొరుగువారితో ప్రేమగా ఉంటామని స్పష్టంచేశారు కేటీఆర్.

 • Share this:
  తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న టీఆర్ఎస్ బొక్కబోర్లాపడింది. ఆశించిన ఫలితాలు సాధించకపోగా..గతం కంటే రెండు స్థానాలు తగ్గాయి. 2014లో 11 సీట్లు గెలిచిన టీఆర్ఎస్..ఈసారి 9 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం మరో చోట గెలిచాయి. సాక్షాత్తు సీఎం కూతురు కవిత నిజామాబాద్‌లో ఓడిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. ఆశించిన స్థానాలు రాలేదని.. ఏం జరిగిందన్న దానిపై విశ్లేషించుకుంటామని తెలిపారు.

  మాకు మెజార్టీ స్థానాలు కట్టబెట్టారు. కేంద్రంలో హక్కులు సాధించుకునే బాధ్యతను అందించారు. మాకు 16 స్థానాలు రావాలని కోరుకున్నాం. కష్టపడ్డాం. మేం 9 స్థానాలు గెలిచాం. ప్రజల తీర్పు శిరోధార్యం.  గెలిచిన కాంగ్రెస్, బీజేపీ మిత్రులకు ధన్యవాదాలు.  ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములు సహజం. తెలంగాణ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తాం. కొన్ని చోట్ల భిన్న ఫలితాలు వచ్చాయి. ఏం జరిగిందన్న దానిపై విశ్లేషించుకుంటాం.
  కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్


  ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోదీకి, ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. తమకు ఎవరితోనూ శత్రుత్వాలు లేవని..పొరుగువారితో ప్రేమగా ఉంటామని స్పష్టంచేశారు కేటీఆర్.

  First published: