కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ బరిలోదిగి ఓటమి పాలయ్యారు. ఐతే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీచేసిన రేవంత్..టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని ఓడించి విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. 88 సీట్లను సాధించిన టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. గులాబీ సునామీలో కాంగ్రెస్, బీజేపీలు కొట్టుకుపోయాయి. కారు హోరులో రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కిషన్ రెడ్డి వంటి బలమైన నేతలు సైతం ఓడిపోయారు. ఐతే ఐదు నెలలు గడిచేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థానాలు సాధించలేక బోర్లాపడింది. 2014 ఎన్నికల్లో 11 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 8 సీట్లకే పరిమితమైంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు నేతలు ఇప్పుడు ఎంపీలుగా గెలుపొందారు.
డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. గతంలో కొడంగల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేవంత్.. 2018లో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ బరిలోదిగి ఓటమి పాలయ్యారు. ఐతే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీచేసిన రేవంత్..టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని ఓడించి విజయం సాధించారు. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఇలానే గెలిచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఐతే లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగి టీఆర్ఎస్కు షాకిచ్చారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌పై ఓడించి ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వెంటకరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేయడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కలిసివచ్చింది.
డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి బండి సంజయ్ ఓడిపోయారు. హిందూ ఓటు బ్యాంకులో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు ఉన్నా కారు హోరులో అప్పుడు ఓడిపోయారు. ఐనా ఓటమి భారంతో కుంగిపోకుండా ప్రజలక చేరువగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు సంజయ్. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి బలమైన టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ను ఓడించారు. ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.