Home /News /politics /

TELANGANA LEADERS SHOWING INTEREST ON TRS STATE COMMITTEE WHICH WILL BE FORMED SOON AK

Telangana: త్వరలోనే టీఆర్ఎస్‌లో ఆ కొత్త కమిటీ.. కేసీఆర్ నిర్ణయంపై పార్టీలో ఆసక్తి ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

TRS: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ను పోటీ కాస్త గట్టిగానే ఉంటుందనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని.. కాబట్టి రాష్ట్ర కార్యవర్గాన్ని భారీగానే నియమిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఓ వైపు పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటూనే.. పార్టీలో మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. రెండు రోజుల క్రితం కొత్తగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా పలువురికి బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. ఎవరూ ఊహించని విధంగా కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వారిలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత.. త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షులుగా ఎక్కువశాతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్ర కమిటీలో ఎవరిని తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ను పోటీ కాస్త గట్టిగానే ఉంటుందనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని.. కాబట్టి రాష్ట్ర కార్యవర్గాన్ని భారీగానే నియమిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్ర కమిటీలో ఎంపిక చేసే నేతల విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. కేవలం మొక్కుబడిగా కమిటీల్లో ఉండేవారితో లాభం లేదని.. విపక్షాలపై దూకుడుగా వ్యవహరించే నేతలకు కీలకమైన ఈ కమిటీల్లో చోటు కల్పించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్, కేటీఆర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    అందుకే అలాంటి నేతలను ఎంపిక చేసే పనిలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని సమాచారం. మరోవైపు ఇప్పటికే పలువురికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడంతో.. ఆ నేతలకు రాష్ట్ర కమిటీలో స్థానం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న చాలామంది నాయకులు.. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో తమకు చోటు దక్కుతుందా ? అని ఎదురుచూస్తున్నారు.

    Telangana Politics: రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన ఆ సీనియర్ నేత వ్యవహారం ?

    YS Sharmila: ఏపీ రాజకీయాలపై కుండబద్ధలు కొట్టిన వైఎస్ షర్మిల.. ఏమన్నారంటే..

    పలువురు జిల్లా స్థాయి నేతలు సైతం రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ ఎవరి మీద ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర కమిటీని కూడా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉందని... తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని భావిస్తున్న కొందరు నేతలకు కూడా ఈ కమిటీలో చోటు దక్కవచ్చని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి పార్టీ నిర్మాణంపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిన గులాబీ బాస్.. రాష్ట్ర కమిటీలో ఎవరు చోటిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు