Etela Rajendar: హరీశ్ రావుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajendar: టీఆర్ఎస్ తరపున గెలిచారని పదే పదే కొందరు నేతలు అనడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు అన్నారు. నియోజకవర్గంలో తమతో తిరిగే వారిని పోలీసులు ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

  • Share this:
    టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తనపై కొందరు టీఆర్ఎస్ నేత పనికిరాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన మాజీ సహచరుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. తన నియోజకవర్గం వారికి హరీశ్ రావు డబ్బు, పార్టీలు ఇచ్చిన ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దగ్గర మెప్పుపొందాలనే హరీష్‌రావు ప్రయత్నిస్తున్నారని.. కానీ ఆయనకు చివరకు తన గతే పడుతుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

    మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై అధికార పార్టీ మీడియాలో వచ్చిన వార్తలు చూసి ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని ఈటల అన్నారు. టీఆర్ఎస్ తరపున గెలిచారని పదే పదే కొందరు నేతలు అనడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు అన్నారు. నియోజకవర్గంలో తమతో తిరిగే వారిని పోలీసులు ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసులు, అధికారులు చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. హుజూరాబాద్ ప్రజలు తమవైపే ఉంటారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: