Home /News /politics /

TELANGANA LAND REGISTRATIONS FEES WILL INCREASE TAKE DECISION IN TO DAY CABINET MEETING NGS

Telangana: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు.. నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం..!

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ఫీజు పెరగనుందా..? ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అంటే.. భూములు కొనుక్కోవాలి అనుకున్న వారికి ఇబ్బందులు తప్పవు.. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు దీనిపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా..? వెనుకడుగు వేస్తుందా..? నేటి కేబినెట్ భేటీలో తేలిపోనుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ సొంతిళ్లు కొనాలుకున్నా.. పెట్టుబడి కోసం భూములు కొనాలి అనుకున్నవారికి షాక్ ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజులను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రిజిస్ట్రేషన్ల ఫీజును కూడా సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద భూమి లేదా ఆస్తి విలువలో 6 శాతం వసూలు చేస్తున్నారు. ప్రస్తుత చార్జీపై 1.5 లేదా 2 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న ఆస్తి విలువలో 7.5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచరాం. ఇతర ఇప్పటికే 7-8 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజును వసూలు చేస్తుండటం, రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా ఈ ఫీజులు పెంచకపోవడంతో.. ఈసారి ఫీజుల పెంపుదల ప్రతిపాదనను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే భూముల విలువలను పెంచుతున్న సమయంలోనే రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా పెంచితే.. ప్రజలపై భారం పడినట్టు అవుతుందనే.. ఇది రాజీకయంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచరం. అసలే హుజూరాబాద్ ఎన్నికల వేడి పెరిగింది. ఇలాంటి సమయంలో పెంపు జోలికి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి నేడు జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ
    సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

    రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలు, చార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ఇప్పటికే పూర్తైంది. రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలకు సుమారుగా 500 కోట్ల రూపాయలు ఉంటున్నట్టు ఆ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా విలువలు, చార్జీల పెంపు అమల్లోకి వస్తే.. ఆదాయం 50 శాతం మేర పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే నెలనెలా అదనంగా 250 కోట్ల రూపాయలు వస్తాయని.. మొత్తంగా నెలకు 750 కోట్ల రూపాయల చొప్పున.. ఏడాదికి 9 వేల కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 12,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అంటే ఆ లెక్కన మరో 3,500 కోట్లు ఎలా సమకూర్చుకుంటారన్న దానిపైనా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

    భూములు, ఆస్తుల విలువలు పెంచితే.. వాటి ఆధారంగా రుణాలు కూడా కాస్త ఎక్కువగా, సులువుగా లభించే వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయముంది. అందువల్ల విలువల సవరణ వల్ల కట్టే చార్జీ పెరిగినా.. క్రయవిక్రయదారులు పెద్దగా ఇబ్బందిపడే అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. అదే ఫీజు కూడా పెంచితే భారం పెరిగిందనే భావన ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి. ఈ రెండు రకాల వాదనలపై కేబినెట్‌ భేటీలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో రెండేళ్లకోసారి.. పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1 నుంచి వర్తించేలా భూములు, ఆస్తుల విలువలను సవరించేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఈ సవరణ
    జరగలేదు. ప్రస్తుతం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. ఈ కేబినెట్‌ సమావేశంలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి.

    మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు, భూముల విలువ పెంపుతోపాటు 50 వేల ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వానాకాలం సీజన్‌ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ స్థితిగతులు, పాఠశాలలు, పుస్తకాల పంపిణీ, ఇతర విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్టు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Dharani Portal, Jobs in telangana, Land registration, Telangana, Telangana cabinet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు