జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి...సీపీఐ నారాయణ ఆగ్రహం

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ హైదరాబాద్‌లో సీపీఐ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

news18-telugu
Updated: June 14, 2019, 4:08 PM IST
జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి...సీపీఐ నారాయణ ఆగ్రహం
కేసీఆర్, జగన్, నారాయణ
news18-telugu
Updated: June 14, 2019, 4:08 PM IST
ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఇటు తెలంగాణ, అటు ఏపీలో దుమారం రేపుతోంది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అటు ఏపీలో ఫిరాయింపులపై జగన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీలోకి రావాలనుకునే నేతలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిరావాలని స్పష్టం చేశారు. జగన్ నిర్ణయాన్ని ఇరురాష్ట్రాల్లోని పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీపీఐ నారాయణ. ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని విమర్శలు గుప్పించారు.

ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే నాయకులు సిగ్గు విడిచి పార్టీలు మారుతున్నారు. ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి కుటుంసభ్యుల్ని అమ్మేందుకు వెనుకాడరు. ఫిరాయింపులు విషయంలో కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలి. జగన్ కాళ్ల కింద నుంచి వందసార్లు దూరినా కేసీఆర్‌కు బుద్ధిరాదు. మోదీ, అమిత్ షా, కేసీఆర్‌లు ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం దారుణం. చట్ట సభల్లో ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా మారతారు.
నారాయణ


తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ హైదరాబాద్‌లో సీపీఐ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గోపాలపురం పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వైఖరిపై విరుచుకుపడ్డారు నారాయణ.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...