హోమ్ /వార్తలు /National రాజకీయం /

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?

తీన్మార్ మల్లన్న క్యూన్యూస్  క్రియేట్ చేసిన ఫొటోఇది.

తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ క్రియేట్ చేసిన ఫొటోఇది.

తెలంగాణలో అధికార సాధనే ధ్యేయంగా కదులుతోన్న బీజేపీ.. ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతలను, కేసీఆర్ వ్యతిరేకులను, ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటూ 2023 ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నక్రమంలో ఈటల రాక, హుజూరాబాద్ విజయం గేమ్ ఛేంజర్ గా నిలిచిందనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టు, క్యూ-న్యూస్ మీడియా అధినేత తీన్మార్ మల్లన్న సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తాను బీజేపీలో చేరబోతున్నట్లు తొలిసారి అధికారికంగా ప్రకటించారు మల్లన్న.

ఇంకా చదవండి ...

సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప పోరులో బీజేపీ సంచలన విజయం తర్వాత ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటలే అనే ప్రచారం జరుగా సాగింది. బీజేపీలోని మిగతా నేతలకు భిన్నంగా ఎత్తుకునే సమస్య నుంచి నోటి వెంట వచ్చే పదాల దాకా తనదైన శైలిలో రాజేందర్ ముందుకెళుతున్నారు. ఈక్రమంలో ఆయన చూపుతోన్న దూకుడు పార్టీ నాయకత్వానికి రుచించడంలేదనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దూరంగా ఉంటుందని పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చెబితే, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈలల రాజేందర్ మాత్రం బాహాటంగా టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీంద్ సింగ్ కు మద్దతు పలకడం పార్టీలో ఆధిపత్యపోరుకు తార్కాణంగా నిలిచింది. తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయా? లేక ఈటలా? అని అధికార టీఆర్ఎస్ నేతలు అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల దూకుడుకు సొంత పార్టీ నేతలే చెక్ పెట్టబోతున్నారా? తీన్మార్ మల్లన్న లాంటి పాపులర్ నేతల ద్వారా ఆపని చేయబోతున్నారా? ఆ దిశగా మల్లన్న కూడా సంకేతాలిచ్చారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయిప్పుడు..

సీఎం కేసీఆర్ తో విభేదించి, భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయి, నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప పోరులో ఈటల రాజేందర్ అనూహ్య విజయం సాధించిన తర్వాత.. తెలంగాణలో తటస్థులు, ఉద్యమకారులు, బహుజననేతలు పలువురు బీజేపీ బాటపడుతున్నారు. లెఫ్ట్ రాజకీయాల్లో పుట్టిపెరిగి, ఉద్యమం ద్వారా ఉన్నత స్థాయికి వెళ్లి, ఇప్పుడు రైట్ వింగ్ పార్టీలో కొత్త భూమిక పోషిస్తోన్న ఈటల రాజేందర్ చూపిన భరోసాతో ఆయన లాంటి ప్రస్తానమే కలిగిన ఇతర నేతలూ కాషాయ కండువా కప్పుకోడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా తనదైన పాత్ర పోషించిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారైంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన చింతలగట్టు విఠల్‌ సైతం బీజేపీలో చేరుతున్నారు.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..తెలంగాణలో అధికార సాధనే ధ్యేయంగా కదులుతోన్న బీజేపీ.. ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతలను, కేసీఆర్ వ్యతిరేకులను, ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటూ 2023 ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నక్రమంలో ఈటల రాక, హుజూరాబాద్ విజయం గేమ్ ఛేంజర్ గా నిలిచిందనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టు, క్యూ-న్యూస్ మీడియా అధినేత తీన్మార్ మల్లన్న సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తాను బీజేపీలో చేరబోతున్నట్లు తొలిసారి అధికారికంగా ప్రకటించారు మల్లన్న. డిసెంబర్ 7వ తేదీన(మంగళవారం) తాను బీజేపీలో చేరబోతున్నట్లు తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాషాయ కండువా కప్పుకొనే ప్రక్రియకు సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాయని..డిసెంబర్ 7న బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. అయితే..

Hyderabad : చూడ్డానికి అమాయకంగా ఉన్నారు కదా! చేసింది తెలిస్తే ఛీకొడతారు!! -హీరో సూర్యలాగాబీజేపీలో చేరబోతున్నాననంటూ తీన్మార్ మల్లన్న చేసిన ప్రకటనలో పేరుపేరునా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ జాబితాలో ఈటల పేరు మాత్రం లేకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, వివేక వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, మురళీధర్ రావు, రఘునందన్ రావులతోపాటు అమిత్ షా, ప్రధాని కార్యాలయాలను ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పిన తీన్మార్ మల్లన్న.. ఈటల రాజేందర్ పేరును మాట వరుసకైనా ప్రస్తావించకపోవడం స్థలాభావమా? లేక అంతర్గత వ్యూహమా? అనేది చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ పై విమర్శల జోరు, ఎన్నికల్లో హోరాహోరీ పోరు (పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ స్వల్ప తేడాతో ఓడిపోవడం తెలిసిందే) విషయంలో ఈటల, తీన్మార్ ఇద్దరినీ బీజేపీ ఒకే గాటిన కట్టి చూస్తోందని, తీన్మార్ మల్లన్న చేరికతో ఈటల దూకుడుకు అడ్డుకట్టపడుతుందని కమలం నేతలు భావిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కేసీఆర్ వ్యతిరేకులంతా ఇప్పుడు బీజేపీ పంచన చేరుతుండటం గమనార్హం.

First published:

Tags: Bjp, Etela rajender, Teenmar mallanna, Telangana

ఉత్తమ కథలు