తెలంగాణ జాగృతి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు నిర్వహించనుంది. శనివారం ఉదయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. హైదదరాబాద్ హెచ్‌ఐసిసి లోని నోవాటెల్ హోటల్‌లో సదస్సు జరగనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సదస్సు ఉద్దేశ్యాలను వివిధ దేశాలనుంచి విచ్చేసిన ప్రతినిధులకు శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వివరించారు. గాంధీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని, గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి సాధనతో పాటు నూతన ఆవిష్కరణలు కోసం సదస్సులో యువ నాయకులు చర్చించాలని ఎంపి కవిత కోరారు.
పద్మభూషణ్ అన్నాహజారే సదస్సు లో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేశారు. సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ తాపా ప్రత్యేక అతిథిగా శుక్రవారం రాత్రి నోవాటెల్ జరిగిన ఆతిథ్య సమావేశంలో పాల్గొన్నారు. శ్రీలంక పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి బుదికా పథిరాణా, మాసిడోనియా రిపబ్లిక్ పెట్టుబడుల శాఖ మాజీ మంత్రి గ్లిగర్ తస్కోవిచ్, ఒకినవా, అప్ఘనిస్తాన్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వ్యవస్థాపకుడు జాన్ డిక్సన్ తో పాటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ హాజరయ్యారు. 20వ తేదీన సాయంత్రం జరిగే ముగింపు సమావేశానికి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు ప్రధానంగా కేంద్రీకరిస్తుంది. 110 దేశాల నుంచి 500 కు పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు కవిత. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని ఆమె తెలిపారు. శనివారం సదస్సు ప్రారంభ కార్యక్రమం ముగిశాక యువత అభివృధ్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్టిని నిర్వహిస్తారు. అసోం ఎంపి గౌరవ్ గగోయ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసితో పాటు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్యానలిస్టులుగా పాల్గొంటారు.
యునైటెడ్ నేషన్స్‌లో నేపాల్ శాశ్వత ప్రతినిధి మధు రామన్ ఆచార్య, శ్రీలంక పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి బుదికా పథిరాణా, మాసిడోనియా రిపబ్లిక్ పెట్టుబడుల శాఖ మాజీ మంత్రి గ్లిగర్ తస్కోవిచ్, ఒకినవా, అప్ఘనిస్తాన్‌లలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వ్యవస్థాపకుడు జాన్ డిక్సన్ చర్చలో పాల్గొని ప్రసంగిస్తారు. రెండో రోజు నైపుణ్య శిక్షణ, సమతులాభివృద్ధిలో యువత, మహిళల పాత్ర, కార్పోరేటు, ప్రభుత్వాల భాగస్వామ్యం పై చర్చిస్తారు.
వైఎస్ షర్మిల ఫిర్యాదు..పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
‘థ్యాంక్యూ... మెట్రో’... వైరల్‌గా మారిన హైదరాబాద్ మహిళ ఫేస్‌బుక్ పోస్ట్...
ఇవికూడా చూడండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, MP Kavitha, Telangana, Telangana News, Trs