హుజూర్ నగర్ ఉప ఎన్నిక డేట్ ఫిక్స్... షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతిని ఎన్నికల బరిలోకి దింపుతామని ప్రకటించారు. అధికారికంగా దీనిపై ప్రకటన చేయకపోయిన.. అప్పుడే ఉత్తమ్ ప్రకటనపై పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: September 21, 2019, 12:52 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక డేట్ ఫిక్స్... షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 21, 2019, 12:52 PM IST
తెలంగాణ హుజూర్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చేనెల అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగానూ విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. దీంతో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతిని ఎన్నికల బరిలోకి దింపుతామని ప్రకటించారు. అధికారికంగా దీనిపై ప్రకటన చేయకపోయిన.. అప్పుడే ఉత్తమ్ ప్రకటనపై పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

ఉత్తమ్ నిర్ణయాన్ని రేవంత్ వ్యతిరేకిస్తున్నారు.ఆయన అభ్యర్థి చామల కిరణ్ రెడ్డిని బరిలోకి దించుతానంటున్నారు రేవంత్. అయితే రేవంత్ నిర్ణయం పట్ల కాంగ్రెస్ సీనియర్లంతా సీరియస్ అవుతున్నారు...ఉత్తమ్‌కే పార్టీ నేతలు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా హుజూర్ నగర్‌పై దృష్టి పెట్టింది. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కవితను ఇక్కడ్నుంచి బరిలోకి దించాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక అందుకోసం పక్కా వ్యూహాలను రచించే పనిలో పడ్డారు కెసిఆర్.దీంతో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య గట్టి పోరు తప్పదని భావిస్తున్నారు రాజకీయ నిపుణులు. అక్టోబర్ 21న హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక నిర్వహించి... అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...