Home /News /politics /

TELANGANA HIGHCOURT HEARING ON TSRTC STRIKE TODAY MS

TSRTC Strike : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ.. ఏం చెప్పబోతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

    ఆర్టీసీ సమ్మెపై శనివారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిల వివరాలను సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ కోర్టుకు అందించారు. కోర్టు ఆదేశం మేరకు ఎండీతో పాటు ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారులు కూడా కోర్టుకు హాజరుకానున్నారు. రాష్ట్ర విభజన దగ్గరి నుంచి ఆర్టీసీ అప్పులు,ఆదాయం,ఆస్తులు,నష్టాలపై పూర్తి నివేదికను కోర్టుకు అందించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ.335కోట్ల బకాయిలు ఆర్టీసీకి చెల్లించారా? అన్న దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ప్రభుత్వం చెల్లించిన రూ.4253కోట్లలో రీయింబర్స్‌మెంట్ బకాయిలు
    ఉన్నాయా? అన్న దానిపై కూడా కోర్టు విచారణ జరపనుంది.

    ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఆర్టీసీ ఎండీ నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కౌంటర్ దాఖలు చేశారు. అటు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం,అందాల్సిన బకాయిలు,బస్ పాసుల రీయింబర్స్‌మెంట్,ఆస్తుల అన్యాక్రాంతంపై పూర్తి లెక్కలను కోర్టుకు సమర్పించనున్నారు.అలాగే అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగాల్లో కేసీఆర్ ఆర్టీసీ గురించి ప్రస్తావించిన విషయాలు,ఇచ్చిన వాగ్దానాలను కూడా కోర్టుకు నివేదిక రూపంలో తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందించబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Highcourt, Telangana, Trs, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు