ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు..
TSRTC Strike : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 34వ రోజుకు చేరుకుంది. సమ్మెపై ఈ రోజు హైకోర్టులో తీర్పు వెలువడనుంది.
news18-telugu
Updated: November 7, 2019, 7:55 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: November 7, 2019, 7:55 AM IST
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 34వ రోజుకు చేరుకుంది. సమ్మెపై ఈ రోజు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కార్మికుల ప్రతినిధులతో పాటు, ప్రభుత్వం తరఫున కోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరుకానున్నారు. మరోవైపు, ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపైనా హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఇదిలా ఉండగా, కోర్టు తీర్పు అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటు రూట్లపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. మిగతా సగాన్ని కూడా ప్రైవేటీకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10,200 ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీలో వారికి ఉద్యోగాలు... కేసీఆర్ హామీ అమలు...
కేసీఆర్‌కు సీనియర్ నేత షాకిస్తారా... నిర్ణయం అప్పుడే...
కేసీఆర్ సన్నిహితుడికి మంత్రి హోదా... ఉత్తర్వులు జారీ...
కేసీఆర్ ఉగ్రరూపం... ఎన్‌కౌంటర్‌పై మంత్రి రియాక్షన్
ఆ హామీలకు నా హార్ట్ స్పీడ్ పెరిగింది.. కేసీఆర్‌పై హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్టీసీలో లేఖల కలకలం... కార్మికులకు కొత్త టెన్షన్
Loading...