ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతపై విచారణ వాయిదా.. కేసు తేలేంత వరకు ముట్టుకోవద్దని..

ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 8, 2019, 4:43 PM IST
ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతపై విచారణ వాయిదా.. కేసు తేలేంత వరకు ముట్టుకోవద్దని..
తెలంగాణ హైకోర్టు (File)
  • Share this:
ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణకు ఈ రోజు మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ తరఫున వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్ నిర్ణయాధికారం ఉంటుందని తెలిపారు.చారిత్రక ,వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళు దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని కోర్టుకు వెల్లడించారు.100 ఏళ్ళు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఎర్రమంజిల్‌ను డైరెక్టరేట్ ఆర్కియాలజీ జాతీయ సంపదగా గుర్తించిందా? అని ప్రశ్నించింది.

ప్రస్తుతం ఆ వివరాలు తమ వద్ద లేవని, పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంలో గూగుల్ మ్యాప్‌ను మరో సారి హైకోర్టు పరిశీలించింది. తదుపరి విచారణకు బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. కాగా, సచివాలయ భవనం, ఎర్రమంజిల్ కోర్టు కూల్చివేతలపై పాడి మల్లయ్య అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...