ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం... ఆర్టీసీ జేఏసీ పిటిషనర్‌పై మండిపడింది. ఆర్టీసీ కార్మికులకు హార్ట్ ఎటాక్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని పేర్కొంది. చనిపోయిన వారందరూ ప్రభుత్వం కారణంగానే చనిపోయారని అనడానికి ఆధారాలేంటి ? అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదంది. సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ యూనియన్లే కాబట్టి.. వారే దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
ప్రభుత్వం తీరుతోనే ఆత్మహత్యలు చేసుకున్నట్లు పలు సూసైడ్ నోట్లను కోర్టు ముందు ఉంచారు పిటిషనర్. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే మరిన్ని ఆత్మహత్యలు జరుగుతాయన్న పిటీషనర్ పేర్కొన్నారు. డిపోలోకి అనుమతి ఇవ్వక పోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌ను హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.
Published by:Sulthana Begum Shaik
First published:November 26, 2019, 15:57 IST