TELANGANA HIGH COURT ORDERS TSRTC EMPLOYEES TO CALL OFF STRIKE AND START TALKS WITH GOVERNMENT BS
ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు ఊరట.. మీ ఉద్యోగాలు భద్రమే..
ప్రతీకాత్మక చిత్రం
TSRTC: మంగళవారం హై కోర్టు వ్యాఖ్యలు కార్మికులకు కాస్త ఊరటనిచ్చాయి. అదెలా అంటే.. ‘ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వంలో చర్చలు జరపాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల ఉద్యోగాలు భద్రంగానే ఉన్నాయి కాబట్టే.. చర్చలు జరపాలని చెప్పింది.
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొని సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కొత్త వారిని నియమించుకోవడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. దానిలో భాగంగానే.. తాత్కాలిక నియామకాల పేరుతో డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకుంది. ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మె విరమించే ప్రస్తకే లేదని తేల్చి చెప్పారు. అయితే, కొంతమంది కార్మికులు.. ఉద్యోగం పోయిందన్న భయంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు దిగులుతో మంచానపడ్డారు. కొందరైతే గుండె సంబంధిత వ్యాధులకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎన్నో ఆర్టీసీ కార్మిక కుటుంబాల ముఖాల్లో ఆందోళన కనిపించింది. ఇంటికి ఆసరాగా ఉన్న ఉద్యోగం పోయిందని, నెల నెలా ఇంటిని ఎలా నెట్టుకొచ్చేదంటూ దు:ఖంలో మునిగిపోయారు. అదీకాక.. దసరా ముందు సెప్టెంబరు నెల జీతాలు రాకపోవడం వారిని మరింత కుంగదీసింది. అయితే.. మంగళవారం హై కోర్టు వ్యాఖ్యలు కార్మికులకు కాస్త ఊరటనిచ్చాయి. అదెలా అంటే.. ‘ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వంలో చర్చలు జరపాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల ఉద్యోగాలు భద్రంగానే ఉన్నాయి కాబట్టే.. చర్చలు జరపాలని చెప్పింది.
వాస్తవానికి, కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసినా.. దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు గానీ, నోటిఫికేషన్ గానీ విడుదల కాలేదు. దీన్ని బట్టి కార్మికుల ఉద్యోగాలు భద్రంగానే ఉన్నట్లు లెక్క. ఇక, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేకే కూడా ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం, దానికి జేఏసీ నేతలు ఒప్పుకోవడాన్ని బట్టి ఉద్యోగాలకు ఢోకా లేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం, కార్మికులు చర్చలు జరిపి 18వ తేదీన శుభవార్తతో కోర్టుకు రావాలని తీర్పును వాయిదా వేశారు న్యాయమూర్తి.
అయితే, ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా, ఆర్టీసీ కార్మికులు ఇప్పటి వరకు సమ్మె విరమించలేదు. ఒకవేళ 18వ తేదీ నాటికి కూడా సమ్మె విరమించకుండా, మొండిగా వ్యవహరిస్తే హైకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో. చూద్దాం.. ఏం జరుగుతుందో..!
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.