Hyderabad-GHMC Elections: ఎన్నికల కమిషన్ కు హై కోర్టు కీలక సూచన.. ఆ డివిజన్లలో రీ పోలింగ్?

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)

GHMC Election Results 2020: రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కీలక సూచన చేసింది.

  • Share this:
    రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కీలక సూచన చేసింది. పలు డివిజన్లలో రీ పోలింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించింది. ఘాన్సీ జజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సూచనలు చేసింది. ఈ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని బీజేపీ నేతలు సైతం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. రేపే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో హై కోర్టు సూచనలపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ కోర్టు సూచనలను ఎస్ఈసీ పరిగణలోకి తీసుకుని రీ పొలింగ్ నిర్వహించాలని భావిస్తే కౌంటింగ్ ఆపే అవకాశం ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: