RTC Strike: ఆర్టీసీ సమ్మె... హైకోర్టు పరిష్కారం చూపిస్తుందా ?

ఆర్టీసీ సమ్మెపై రేపు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది.

news18-telugu
Updated: October 14, 2019, 3:49 PM IST
RTC Strike: ఆర్టీసీ సమ్మె... హైకోర్టు పరిష్కారం చూపిస్తుందా ?
తెలంగాణ హైకోర్టు, ఆర్టీసీ బస్సు
news18-telugu
Updated: October 14, 2019, 3:49 PM IST
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం ఎప్పుడు ? ఇదే ఇప్పుడు తెలంగాణలోని ప్రజలందరిలోనూ ఉన్న సందేహం. కార్మికులు, ప్రభుత్వం ఎవరికి వారే పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో... సమ్మెకు ముగింపు ఎప్పుడో ఎవరికి అర్థంకావడం లేదు. కార్మికులు, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో... న్యాయస్థానమే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు ఆశిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపి వాయిదా వేసిన హైకోర్టు... రేపు మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టనుంది. సమ్మెపై అటు ఆర్టీసీ సంఘాల జేఏసీ, ఇటు ప్రభుత్వం నివేదికలు ఇవ్వాలని ఈ నెల 10న ఆదేశించిన హైకోర్టు... రేపు వాటిపై విచారణ చేపట్టనుంది.

సమ్మె నేపథ్యంలో ఈ నెల 19 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన ప్రభుత్వం... ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. విచారణ సందర్భంగా ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రేపు ఈ అంశంపై విచారణ జరపనున్న హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేస్తుందా ? సమ్మెకు పరిష్కారం చూపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.







First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...